https://oktelugu.com/

Congress vs BJP : కిషన్ రెడ్డి జుట్టు.. ధర్మపురి అరవింద్ గుండు..

Congress vs BJP : ప్రజా జీవితంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు.

Written By: , Updated On : March 21, 2025 / 11:01 AM IST
Congress vs BJP

Congress vs BJP

Follow us on

Congress vs BJP : గతంలో ఏపీ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు అడ్డగోలుగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తీసుకున్నట్టు కనిపిస్తోంది.. గతంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు రం*, బే****, ఇంకా రాయడానికి వెళ్లేని భాషలో బూతులు తిట్టేవారు. ఆ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ భాష విషయంలో ప్రజాప్రతినిధుల తీరు పెద్దగా మారలేదు. పైగా విమర్శల తీరు ఒక స్థాయి దాటిపోయింది. వ్యక్తిగత విషయాలను మాట్లాడే దాకా వచ్చింది. ఇప్పుడిక బాడీ షేమింగ్ కూడా పెరిగిపోయింది. అయితే ఈ విషయంలో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. మద్యం తాగడం, బట్టతల, గోడలు దూకడం వంటి పదాలు ఇప్పుడు తెలంగాణలో పరిపాటిగా మారాయి. అయితే ఇవి చదువుతుంటే పెద్దగా ఇబ్బంది కలకపోయినప్పటికీ.. వీటిని ఉపయోగించి నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం వారి దిగజారుడుతనాన్ని సూచిస్తోంది. నేతల మాటల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వస్తుందా అప్పటికి వారు తమ తీరు మార్చుకోవడం లేదు. పైగా తమ వ్యక్తిగత కక్షలను మరింతగా పెంచుకుంటూ.. ప్రజల్లో వైషమ్యాలు పుట్టిస్తున్నారు.

Also Read : కాంగ్రెస్‌ వర్సెస్‌ బీజేపీ.. రాహుల్ టెర్రరిస్ట్ వ్యాఖ్యలపై మాటల మంటలు

జుట్టుకు, గుండుకు సంబంధం

తాజాగా రమ్య రెడ్డి అని టీపీసీసీ అధికార ప్రతినిధి ఒకరున్నారు. సాధారణంగా అధికార ప్రతినిధులు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలి. ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాలి. అంతేతప్ప ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అయితే రమ్య రెడ్డి ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో తెలంగాణ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు అనే విషయాన్ని చెప్పకుండా.. తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించకపోవడాన్ని ఆమె మరో విధంగా చెప్పారు. విమర్శలు కూడా ఒక స్థాయి దాటి చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు వచ్చే నిధులను కిషన్ రెడ్డి జుట్టు స్థాయిలో ఊహించామని.. కానీ ధర్మపురి అరవింద్ గుండు స్థాయిలో తెలంగాణకు నిధులు ఇచ్చారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి విమర్శలు చేస్తున్నప్పుడు అధికార ప్రతినిధులు ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిధులు ఎలా కేటాయించింది? ఇప్పుడు బిజెపి ఎలా కేటాయిస్తోంది? ప్రాంతం ప్రాతిపదికగా.. జనాభా ప్రాతిపదికగా నిధులు ఎలా ఇస్తారు. తెలంగాణ బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ బడ్జెట్లో సింహభాగం నిధులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అలాంటప్పుడు ఆ డబ్బులు మొత్తం హైదరాబాదులోనే ఖర్చు పెట్టాలి కదా.. కానీ అలా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నిధులు ఒక ప్రాంతం నుంచి వస్తున్నప్పటికీ.. వాటన్నింటిని ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేయడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి రమ్య రెడ్డి విమర్శలు చేశారు. ఆమె మాత్రమే కాదు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఇలానే చవకబారు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విమర్శలు చేయాలి అనుకుంటే.. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సింహభాగం నిధులు కేటాయించిందని.. తెలంగాణకు మొండి చేయి చూపించిందని విమర్శిస్తే బాగుండేది. కానీ వాటిని పక్కనపెట్టి బాడీ షేమింగ్ కు పాల్పడటమే అసలైన దారిద్రం. ఓ మంత్రి ఏమో ప్రతిపక్ష పార్టీ చెందిన ఓ నాయకుడికి.. సినీ తార విడాకులకు సంబంధం అంటగడుతుంది. మరో అధికార ప్రతినిధి “జుట్టు.. గుండు” అంటూ వ్యాఖ్యలు చేస్తుంది. అసలు ఇలాంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎలా భరిస్తుందో.. ఆ పార్టీ నాయకత్వానికే తెలియాలి. మీనాక్షి నటరాజన్ వంటి వాళ్లు కూడా బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ గాడిన పడకపోవడం విశేషం.

Also Read : బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ దిగజారుడు ప్రచారం