Pawan Kalyan
Pawan Kalyan : పవన్ ( deputy CM Pawan)ప్రకటనల వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ప్రతి ప్రకటన వెనుక ఒక పరమార్ధం ఉంటుంది. తాజాగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎం గా ఉండాలని ఆకాంక్షించారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని.. ఇదే సీఎం కొనసాగాలని అభిప్రాయపడ్డారు. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న జనసేన ప్లీనరీలో.. నాలుగు దశాబ్దాల టిడిపిని నిలబెట్టాం అని ప్రకటించారు. దాని ద్వారా కూటమిలో వచ్చిన చిన్నపాటి గ్యాప్ ను మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలని చెప్పడం ద్వారా చెక్ పెట్టారు. అయితే ఇది వ్యూహంలో భాగంగా చేసిన కామెంట్ అని తేలిపోయింది.
* గత ఐదేళ్లుగా అదే వ్యూహం
వాస్తవానికి 2019లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. వ్యూహం మార్చారు పవన్ కళ్యాణ్. ప్రతి అడుగు వ్యూహాత్మకంగానే వేశారు. చంద్రబాబు జైల్లో ఉండగా పరామర్శించి పొత్తు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అమాంతం గౌరవం పెంచుకున్నారు. పొత్తు కుదుర్చుకునే క్రమంలో ఎదురైన ఒత్తిళ్ళను అధిగమించారు. లేనిపోని పంతాలకు పోకుండా.. మూడు పార్టీల సీట్ల సర్దుబాటు సవ్యంగా సాగేలా పవన్ పావులు కదిపారు. ప్రభుత్వం ఏర్పాటు, పవర్ షేరింగ్, మంత్రి పదవుల కేటాయింపు వంటి వాటి విషయంలో ఎటువంటి పట్టు విడుపులకు పోలేదు.
Also Read : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరుకోకూడదు – నిర్మాత నాగవంశీ
* వైయస్సార్ కాంగ్రెస్ కు నిరాశ
అయితే కూటమి( Alliance ) పార్టీల్లో విచ్చిన్నానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ప్రయత్నాన్ని భగ్నం చేయగలిగారు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న ప్లీనరీలో జనసేన పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన చరిత్ర జనసేనది అని చెప్పుకొచ్చారు. దీంతో కూటమిలో చిన్నపాటి గ్యాప్ ఏర్పడింది. అదే సమయంలో జనసైనికులు కూడా ఓకింత రెచ్చిపోయారు. ఇప్పుడు వారిని కంట్రోల్ చేసే విధంగా మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు సీఎం గా ఉండాలని ఆకాంక్షించారు పవన్. తద్వారా కూటమిలో వచ్చిన గ్యాప్ ను పూడ్చడమే కాదు.. జనసైనికుల దూకుడును సైతం నియంత్రించ గలిగారు. వ్యతిరేక ప్రచారం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయగలిగారు.
* బలమైన ఆకాంక్షతో..
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కూటమి విషయంలో బలమైన ఆకాంక్షతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో వచ్చే ఇబ్బందులను అధిగమించి.. మరో 15 సంవత్సరాల పాటు కూటమి విజయవంతంగా నడవడానికి వీలుగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఎప్పుడు ఎలా మాట్లాడాలో.. అలానే మాట్లాడుతున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ నోటా చంద్రబాబు 15 ఏళ్ల పాటు సీఎం గా కొనసాగాలని రావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. జనసైనికుల్లో మాత్రం ఒకింత నిరాశ అల్లుకుంది.
Also Read : మందక్రిష్ణ మాదిగను ఓ రేంజ్ లో ఎత్తేసిన పవన్.. కారణం ఇదే