దుబ్బాకలో పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌

ఒక్క ఉప ఎన్నిక.. సీనియర్‌‌ లీడర్లంతా అక్కడే మకాం.. గ్రామగ్రామాన ఇన్‌చార్జి బాధ్యతలు.. కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకుండా పోయింది కాంగ్రెస్‌ పార్టీ. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికను ఈసారి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆది నుంచీ చాలెంజ్‌గా తీసుకుంది. దీంతో ఆ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డి కూడా నోటిఫికేషన్‌ నుంచి అక్కడే మకాం వేశారు. Also Read: దుబ్బాకలో రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విషయంలోనూ కొన్ని రోజులపాటు […]

Written By: NARESH, Updated On : November 10, 2020 3:14 pm
Follow us on

ఒక్క ఉప ఎన్నిక.. సీనియర్‌‌ లీడర్లంతా అక్కడే మకాం.. గ్రామగ్రామాన ఇన్‌చార్జి బాధ్యతలు.. కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకుండా పోయింది కాంగ్రెస్‌ పార్టీ. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికను ఈసారి కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆది నుంచీ చాలెంజ్‌గా తీసుకుంది. దీంతో ఆ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డి కూడా నోటిఫికేషన్‌ నుంచి అక్కడే మకాం వేశారు.

Also Read: దుబ్బాకలో రౌండ్‌ రౌండ్‌కూ ఉత్కంఠ

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విషయంలోనూ కొన్ని రోజులపాటు సస్పెన్స్‌ నడిచింది. కానీ.. తర్వాత అనూహ్యంగా టీఆర్‌‌ఎస్‌ పార్టీకి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి వచ్చి జాయిన్‌ అయ్యారు. టీఆర్‌‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించినా అధిష్టానం ఆయనకు ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత వైపే టీఆర్‌‌ఎస్‌ అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో అసంతృప్తికి గురైన శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ పొందారు.

Also Read: రాములమ్మ పోతే పోనీ.. కాంగ్రెస్ లైట్

నియోజకవర్గంలో తన తండ్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన సేవలు కలిసివస్తాయని అటు శ్రీనివాస్‌రెడ్డి.. ఇటు కాంగ్రెస్‌ అధిష్టానం భరోసాతో ఉంది. కానీ.. ఈ రోజు వస్తున్న ఫలితాలను చూస్తుంటే టీఆర్‌‌ఎస్‌, బీజేపీలకు కాంగ్రెస్‌ ఏ మూలానా కూడా పోటీ ఇవ్వలేకపోతోందనేది అర్థమవుతోంది. ఏ రౌండ్‌లోనే తన ఆధిక్యతను చాటలేకపోయింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఈ ఉప పోరులో మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ తన స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించగా.. ఆరు, ఏడు రౌండ్లలో టీఆర్‌‌ఎస్‌ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అటు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ టీఆర్‌‌ఎస్‌ ముందు వరుసలో ఉంది. ఇక ఎనిమిదో రౌండ్‌లో బీజేపీ అధిక్యంలోకి వచ్చింది. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 25,878 ఓట్లు, టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 22,772 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డికి 5,125 ఓట్లు వచ్చాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.