https://oktelugu.com/

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

కరోనా(కోవిడ్-19) మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. అగరాజ్యాలు సైతం ఈ వైరస్ ను ఎదుర్కోలేక విలవిలలాడుతోన్నాయి. ప్రపంచం వ్యాప్తంగా కరోనా కేసులు తీసుకుంటే కోటికి చేరువలో ఉంది. ఒకట్రోండురోజుల్లో ఈ సంఖ్యను చేరడం ఖాయంగా కన్పిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా? చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ఒకటి అరా మినహా ప్రపంచంలోని అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్నిదేశాలు మాత్రమే కరోనాను సమర్ధవంతంగా నిలువరించగలిగాయి. మరోవైపు సైంటిస్టులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 23, 2020 / 05:28 PM IST
    Follow us on


    కరోనా(కోవిడ్-19) మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. అగరాజ్యాలు సైతం ఈ వైరస్ ను ఎదుర్కోలేక విలవిలలాడుతోన్నాయి. ప్రపంచం వ్యాప్తంగా కరోనా కేసులు తీసుకుంటే కోటికి చేరువలో ఉంది. ఒకట్రోండురోజుల్లో ఈ సంఖ్యను చేరడం ఖాయంగా కన్పిస్తోంది.

    వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?

    చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ఒకటి అరా మినహా ప్రపంచంలోని అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్నిదేశాలు మాత్రమే కరోనాను సమర్ధవంతంగా నిలువరించగలిగాయి. మరోవైపు సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. ఈ వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తుండటంతో వ్యాక్సిన్ తయారీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతోన్నాయి. అయినప్పటికీ త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందనే ఆశాభావాన్ని సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

    కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వాటి నుంచి బయటేపడి వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈనేపథ్యంతో జెనోవాకు చెందిన ప్రొఫెసర్ బస్సెటీ మాటియో ఈ మహమ్మరి అంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే కరోనా వ్యాక్సిన్ వచ్చేలోపే అదే అంతమవుతుందని అంటున్నారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి.

    ఆ హోంగార్డు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..!

    కోవిడ్-19 తొలినాళ్లలో విజృంభించినట్లుగా ప్రస్తుతం ప్రభావం చూపడంలేదని ఆయన అంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల నుంచి కరోనా క్రమంగా బలహీన పడిపోతుందన్నారు. గతంలో 60ఏళ్లుపైబడిన వాళ్లు కరోనా బారినపడితే కోలుకోవడం కష్టంగా ఉండేదని గుర్తుచేశారు. తాజాగా 80నుంచి 90వృద్ధులు సైతం కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. గతంలో కంటే మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరింత బలహీనపడి వ్యాక్సిన్ లేకుండా అంతమవుతుందని ప్రొఫెసర్ బస్సెట్టి మాటియో తెలిపారు.

    మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొంతమేర సత్ఫలితాలు సాధించినట్లు ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నారు. మరోవైపు భారత్ కు చెందిన గ్లేన్ మార్క్ ఫార్మా కంపెనీ కరోనాకు మెడిసిన్ తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన మందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే మార్కెట్లోకి మందును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

    మరోవైపు హెటిరో కంపెనీ కూడా కరోనా ఇంజెక్షన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటన్నింటిని పరిశీలించినట్లయితే కరోనా అంతం త్వరలోనే అనే సంకేతం కన్పిస్తుంది. ఈ మయదారి రోగం వీలైనంత త్వరగా అంతమైంతే అంతేచాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది. ఇన్నిరోజులు మనవాళిని ఇబ్బందులకు గురిచేసిన కరోనాకు చెడ్డరోజులు ప్రారంభమయ్యాయని నిపుణులు అంటున్నారు.