Revanth Reddy: అన్ని రాజకీయ పార్టీలు హుజురాబాద్ ఉప ఎన్నికలపైనే దృష్టి సారించాయి. ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ దూసుకుపోతుండగా కాంగ్రెస్ మాత్రం వెనుకబడింది. దీంతో ఇక్కడ ద్విముఖ పోరు నెలకొందని అందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా తన ప్రతిష్ట నిలుపుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రచారం ముమ్మరం చేయాలని ఆలోచిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక వచ్చిన తొలి ఎన్నిక కావడంతో ఇక్కడ తమ పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.

అయితే సీనియర్లు రేవంత్ రెడ్డికి సహకరించకపోవడంతో అభ్యర్తి బల్మూరి వెంకట్ హుజురాబాద్ లో ఏ మేరకు ఓట్లు సాధిస్తారో అనే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు సీనియర్లు పార్టీకి దూరంగా ఉండటంతో ప్రచారం సాఫీగా సాగుతుందో లేదో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో పార్టీ బలోపేతం కావాలంటే ఓట్లు సంపాదించే దానిపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు రేవంత్ రెడ్డికి సహకరించట్లేదు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీనిపై పలుమార్లు చర్చలు సైతం జరిగినా వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
ఈ క్రమంలో హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావం ఏ మేరకు కలిగి ఉంటుందో అనే ఉత్కంఠ ఏర్పడుతోంది. అయితే ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్టీ గాడిలో పడుతుందని అందరు భావిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డికి దూరంగా నేతలను దగ్గరగా చేసే కార్యక్రమంగా పేర్కొంటున్నారు.
హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు పోటీలో నిలిచి వాటికి సమ ఉజ్జీగా నిలిచి ఓట్లు సాధించాలని తలపిస్తోంది. దీనికి గాను అభ్యర్థి వెంకట్ తో ప్రచారం ముమ్మరంగా చేయించి ఓట్లు వేయాలని ఓట్లర్లను అభ్యర్థించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పార్టీని గాడిలో పెట్టే పనిలో పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచే క్రమంలో నేతలందరు కలిసి రావాలని ఆకాంక్షిస్తున్నారు.