https://oktelugu.com/

Balakrishna : చిరంజీవి బాటలో బాలయ్య.. సక్సెస్ అవుతాడా?

Balakrishna : గతంలో స్మాల్ స్క్రీన్ పై కనిపించడాన్ని నామూషీగా ఫీలయ్యేవారు సినీ స్టార్స్. యాడ్స్ లో కనిపించడం, షోలకు హోస్ట్ గా వ్యవహరించడం వంటివి ఫేడ్ అవుట్ అయ్యేవాళ్లు చేసే పనిగా భావించేవాళ్లు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లే టీవీల్లో హోస్టులుగా రావడం మొదలైంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై దుమ్ములేపుతున్నారు. ఇప్పటికే తెలుగులో నాగార్జున, చిరంజీవి, […]

Written By:
  • Rocky
  • , Updated On : October 12, 2021 / 10:02 AM IST
    Follow us on

    Balakrishna : గతంలో స్మాల్ స్క్రీన్ పై కనిపించడాన్ని నామూషీగా ఫీలయ్యేవారు సినీ స్టార్స్. యాడ్స్ లో కనిపించడం, షోలకు హోస్ట్ గా వ్యవహరించడం వంటివి ఫేడ్ అవుట్ అయ్యేవాళ్లు చేసే పనిగా భావించేవాళ్లు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లే టీవీల్లో హోస్టులుగా రావడం మొదలైంది.

    ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై
    దుమ్ములేపుతున్నారు. ఇప్పటికే తెలుగులో నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా వంటి స్టార్స్ స్మాల్ స్క్రీన్ పై సందడి చేశారు.. చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బాలయ్య కూడా చేరారు.

    స్టార్ హీరోల్లో నాగార్జున ఎక్కువగా హోస్టుగా సందడి చేశారని చెప్పొచ్చు. మీలో ఎవరు కోటీశ్వరులు షో ద్వారా సత్తా చాటారు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా అలరిసున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రంగప్రవేశం చేశారు. ఆయనకూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో రన్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో నడిపిస్తున్నారు.రానా కూడా నెంబర్ వన్ యారీ షోకు సక్సెస్ ఫుల్ హోస్టుగా పేరు తెచ్చుకున్నారు.

    అయితే.. ఇప్పుడు నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్‌గా దర్శనమివ్వనున్నారు. తొలిసారిగా ఆయన స్మాల్ స్క్రీన్ పై షో రన్ చేయబోతున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ “ఆహా” లో ఓ టాక్ షో చేయనున్నారు. దీనికి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే” ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనే ట్యాగ్ లైన్ చేర్చారు. దీని కోసం బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. దానికి సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, స్మాల్ స్క్రీన్ పై బాలయ్య షోను ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.