
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మృతిచెందడంతో తెలంగాణలో ఉప ఎన్నిక జరుగడం ఖాయమని తేలిపోయింది. అయితే దుబ్బాక ఉప ఎన్నికపై కొద్దిరోజులుగా రాష్ట్రంలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉప ఎన్నికలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీఆర్ఎస్ సీటు కేటాయిస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చేస్తానని ప్రకటించారు. తానే స్వయంగా పీసీసీ ఉత్తమ్ కుమార్, ఇతర సీనియర్ నాయకులతో మాట్లాడి ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చూస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారాయి.
Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు
దీనిపై కాంగ్రెస్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి మాట్లాడిన కొద్దిరోజులకే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ దుబ్బాకలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ తరుఫున ఎవరూ పోటీచేసినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందనే కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ ఎన్నిక ద్వారా ప్రజల్లో టీఆర్ఎస్ పై ఏమేరకు వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకే కాంగ్రెస్ బరిలో నిలుస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికను భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందనే టాక్ విన్పిస్తోంది.
తాజాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దుబ్బాక ఎన్నికపై స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ కు తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ కూడా ఉప ఎన్నికకు సై అనడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న కాంగ్రెస్.. నేడు బీజేపీ ఉప ఎన్నికకు సై అనడంతో టీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది.
Also Read: నవరాత్రి ఉత్సవాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇది తమకు కలిసొస్తుందని కాంగ్రెస్, బీజేపీలు అంచనా వేస్తుంది. తెలంగాణ ఏ ఉప ఎన్నిక జరిగిన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. అయితే ఈసారి గెలుపు అంత సులువు కాదని టాక్ విన్పిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఉప ఎన్నిక బరిలో నిలుస్తామని ప్రకటించడంతో దుబ్బాకలో ఎన్నిక ఏకగ్రీవం కాబోదని తేలిపోయింది.
దీంతో ఆయా పార్టీలు ఇప్పటి నుంచే గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. దుబ్బాకలో గెలిచి భవిష్యత్ రాజకీయాలను శాసించాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ సైతం దుబ్బాకలో గెలిచి తెలంగాణలో దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టాలని భావిస్తుంది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.