Narendra Modi : అప్పట్లో అంటే యూపీఏ హయాంలో పర్యాటకపరంగా భారతదేశాన్ని ప్రమోట్ చేసేందుకు బాలీవుడ్ సినిమా తారలతో యాడ్స్ రూపొందించేవారు. అలా వారికి కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళు. దీనివల్ల ఏమైనా ఒరిగిందా అంటే.. రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతాలను సందర్శించేవారు. ఇక కొత్త ప్రాంతాల గురించి దేవుడెరుగు. చెప్పేవాడు లేడు.. పోయేవాడు అంతకన్నా లేడు. పైగా ఆ సమయంలో సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా లేదు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా టూరిజం రూపురేఖలు మారిపోయాయి. ఎంతలా అంటే కోట్లకు కోట్లు ఇచ్చి బాలీవుడ్ నటులను ప్రచారకర్తలుగా నియమించుకోవడం దాదాపుగా తగ్గిపోయింది. కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఆ బాధ్యతను తలకెత్తుకున్నారు. జస్ట్ అలా పిలుపునిస్తే చాలు.. ఇలా పోలోమంటూ జనం వెళ్లిపోతున్నారు.
లక్షద్వీప్ పర్యటనకు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ ఒక్క పిలుపునిస్తే యావత్ దేశం మొత్తం అటువైపు కదిలింది. మన పర్యాటకం మీద తిక్క తిక్కగా మాట్లాడిన మాల్దీవులపై కుర్చీ మడత పెట్టింది. లక్షద్వీప్ తర్వాత ఇటీవల గుజరాత్ లోని ద్వారకాకు నరేంద్ర మోడీ వెళితే.. ఆ ప్రాంతాన్ని కూడా వేలల్లో పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఆ మధ్య అయోధ్య రామాలయాన్ని మోడీ ప్రారంభిస్తే.. ఇప్పుడు ఆ ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అయోధ్య నగరం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. కేవలం ఉత్తర, దక్షిణ భారతదేశ మాత్రమే కాదు.. ఈశాన్య భారతదేశంపై కూడా నరేంద్ర మోడీ దృష్టి సారించారు.
ఇటీవల అస్సాంలో ప్రధాని పర్యటించారు. అక్కడి కజిరంగా నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఉదయాన్నే అడవిలో సఫారీ వెళ్లారు. అక్కడ అరుదైన జంతువుల ఫోటోలు తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈశాన్య భారతదేశ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ప్రకటించారు. అక్కడ వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దేశంలో ప్రతి మనిషికి స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య, అత్యాధునికమైన వైద్యం, స్వచ్ఛమైన తాగునీరు, సకల సౌకర్యాలు ఉన్న ఇల్లు కల్పించడమే తన ధ్యేయమని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ తర్వాత అస్సాంలోని తేయాకు ఎస్టేట్లను పరిశీలించారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. అక్కడ హౌరా వంతెన సమీపంలో భూగర్భ మెట్రోను ప్రారంభించారు. ఇలా దేశంలో పర్యాటక ప్రాంతాలలో ప్రమోట్ చేస్తూ.. సరికొత్త విధానాలకు మోడీ శ్రీకారం చుడుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ రకరకాల విమర్శలు చేస్తోంది. ఎన్నికలవేళ మోడీ జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తోంది. రకరకాల వేషధారణలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని ధ్వజమెత్తుతోంది. కానీ ఇక్కడ ఆ పార్టీ మర్చిపోయింది ఏంటంటే.. మోడీ ప్రమోట్ చేస్తోంది మనదేశ టూరిజాన్ని.. పైగా పైసా ఖర్చు లేకుండా ఆయన ఆ ప్రాంతాల గురించి వివరిస్తున్నారు. ప్రజలను సందర్శించాలని కోరుతున్నారు. అలాంటప్పుడు అది వ్యక్తిగత ప్రచారం ఎలా అవుతుందో ఆ పార్టీ నేతలకే తెలియాలి. ఒకవేళ వ్యక్తిగత ప్రచారం ఆయనతో మాత్రాన అందులో తప్పేముంది.. మన దేశం గురించి చెప్తున్నప్పుడు అభినందించాలి గాని.. ఇలా రంధ్రాన్వేషణ చేయడం ఏమిటో ఆ పార్టీకే తెలియాలి. అన్నట్టు ఇటీవల మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అయోధ్య, వారణాసి, కాశి, సోమనాథ్, ఉజ్జయిని, ద్వారక వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అలాంటప్పుడు మోడీ చేసింది ప్రచారం ఎలా అవుతుంది.. దానిని వాస్తవం అనాలి.. ఆ వాస్తవాన్ని కాంగ్రెస్ ఎప్పటికీ ఒప్పుకోదు.