Divyabharathi : దివ్యభారతి.. అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు గాని.. బ్యాచిలర్ దివ్యభారతి అంటే వెంటనే జ్ఞప్తికి తెచ్చుకుంటారు. 2021లో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన ఆ సినిమాలో దివ్యభారతి తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన నటనతో అలరించింది. ముఖ్యంగా అలరియే అనే పాటలో ఆమె యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. న్యూ ఏజ్ చిత్రంగా విడుదలైన బ్యాచిలర్ తమిళ చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా మారింది. జీవి ప్రకాష్ కుమార్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జీవి ప్రకాష్ కుమార్ తో పాటు ఈ సినిమా ద్వారా దివ్య భారతికి కూడా మంచి పేరు వచ్చింది. ఆమె అందం, కొంటె చూపులకు యువత ఫిదా అయిపోయారు.
ఆ సినిమాకు ఘనవిజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన ఇష్క్ కు తమిళ రీమేక్ మదిల్ మేల్ కాదల్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం దివ్యభారతి తెలుగులో GOAT అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై దివ్యభారతి భారీ అంచనాలే పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని ఓ పాట 2 మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం కానుంది.
బ్యాచిలర్ సినిమా కంటే ముందే దివ్యభారతి మోడల్ గా పనిచేసింది. పలు అవార్డులు దక్కించుకుంది. సోషల్ మీడియాలో దివ్యభారతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య ఈత కొలనులో కురచ దుస్తులు వేసుకొని దిగిన ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అప్పట్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పుడు మాత్రమే కాదు పలు సందర్భాల్లో దివ్యభారతి అధునాతన దుస్తులు ధరించి ఫోటోషూట్ లో పాల్గొంటుంది. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో మోడ్రన్ దుస్తులు ధరించి రెండు ఫోటోలను ఇటీవల షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసిన యువతలో దివ్యభారతి పొగల్, సెగల్ కక్కించింది. కాగా ఇప్పటికే ఈ ఫోటోలకు 2,454 కామెంట్లు వచ్చాయి. 4.40 లక్షల మంది ఆ ఫోటోలను ఇష్టపడ్డారు.