https://oktelugu.com/

Rahul Gandhi: రాయ్‌బరేలీ బరిలో రాహుల్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేత

రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విజయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామా నడిచింది. రాహుల్‌గాంధీ ఇప్పటికే కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

Written By: , Updated On : May 3, 2024 / 12:16 PM IST
Rahul Gandhi

Rahul Gandhi

Follow us on

Rahul Gandhi: కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాన మంత్రి అవుతారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తున్న రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ట్విస్ట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆయన కేరళలని వాయినాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. తాజాగా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు కాంగ్రెస్‌ అధిష్టానం రాహుల్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆయన శుక్రవారం(మే 3న) నామినేషన్‌ వేయనున్నారు. ఇక అమేథి నుంచి కిశోరీలాల్‌ శర్మ పోటీ చేయనున్నారు. ఇక ప్రియాంక గాంధీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

కాంగ్రెస్‌ కంచుకోట..
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌పార్టీకి కంచుకోట. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో, 1957లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఫిరోజ్‌ గాంధీ(రాజీవ్‌గాంధీ తండ్రి) ఎంపీగా గెలిచారు. దాదాపు దశాబ్దం గ్యాప్‌ తర్వాత ఆయన భార, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా వరుసగా రెండు పర్యాయాలు గెలిచారు. ఇక, 1977లో జనతాపార్టీ తరఫున పోటీ చేసిన రాజ్‌నాయన్‌ విజయం సాధించారు. 1980లో ఇందిరాగాంధీ మరోమారు గెలిచారు. ఆ తర్వాత అరుణ్‌ నెహ్రూ, షీలా కౌల్‌ కాంగ్రెస్‌ తరఫున చెరో రెండు పర్యాయాలు గెలిచారు. 1996–98 టైంలో బీజేపీ అశోక్‌సింగ్‌ ఎంపీగా గెలిచి కాంగ్రెస్‌ రికార్డుకు బ్రేక్‌ వేశారు. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సతీశ్‌ శర్మ విజయం సాధించారు. ఇక 2004 నుంచి ఐదు పార్యయాలు సోనియాగాంధీ ఇక్కడి నుంచి విజయం సాధిస్తూ వచ్చారు.

రెండు స్థానాల విషయంలో హైడ్రామా..
రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విజయంలో కాంగ్రెస్‌లో పెద్ద హైడ్రామా నడిచింది. రాహుల్‌గాంధీ ఇప్పటికే కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల్లో ఆయన దేనిని ఎంచుకుంటారు, పోటీ చేస్తారా లేదా అనే సస్పెన్స్‌ కొనసాగింది. అమేథీ నుంచి రాహల్‌గాంధీ 2004లో పోటీచేసి గెలిచారు. 2014 వరకు మూడుసార్లు విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే అదే ఎన్నికల్లో వాయనాడ్‌ నుంచి గెలిచారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో ఈసారి కూడాడ ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాయనాడ్‌ నుంచే నామినేషన్‌ వేశారు. పోటీకి రాహుల్‌ భయపడుతున్నారని బీజేపీ ప్రచారం చేయడంతో అనేక చర్చల తర్వాత తన తల్లి సోనియాగాంధీ సిట్టింగ్‌ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు.

అన్నా చెల్లెళ్లతో చర్చలు..
అమేథీ, రాయ్‌బరేలీ ఎన్నికల్లో పోటీ విషయమై రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే పలుదఫాలుగా చర్చలు జరిపారు. రెండు స్థానాల నుంచి ఇద్దరిని బరిలో దించాలని భావించారు. చివరకు రాయ్‌బరేలీ నుంచి పోటీకి రాహుల్‌ అంగీకరించారు. అయితే అమేథీ నుంచి పోటీకి ప్రియాంకగాంధీ ఆసక్తి చూపలేదు. దీంతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.