టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లానే. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మాత్రం కాంగ్రెస్ ధాటికి నిలవలేకపోయింది. అప్పుడు ఆ జిల్లాలో ఒక్క జగదీష్ రెడ్డి మాత్రమే గెలవగలిగాడు.. మంత్రి అయ్యాడు. అయితే రెండో దఫా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానానికి […]

Written By: NARESH, Updated On : August 29, 2020 2:03 pm
Follow us on


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లానే. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మాత్రం కాంగ్రెస్ ధాటికి నిలవలేకపోయింది. అప్పుడు ఆ జిల్లాలో ఒక్క జగదీష్ రెడ్డి మాత్రమే గెలవగలిగాడు.. మంత్రి అయ్యాడు. అయితే రెండో దఫా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది.

Also Read: రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?

2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ సత్తా చాటింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఉద్దండులు, ఫైర్ బ్రాండ్స్ లను సైతం మట్టి కరిపించింది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి సహా బడా బడా కాంగ్రెస్ ఉద్దండులు ఓడిపోయారు.. ఇప్పుడు టీఆర్ఎస్ మళ్లీ వేట మొదలుపెట్టడంతో కాంగ్రెస్ పట్టున్న ఓ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోతోందట..

నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారట.. ఆ నియోజకవర్గంలో తన సన్నిహితులు, విధేయులను ఒక్కరొక్కరుగా కోల్పోతున్నాడు. అంతా టీఆర్ఎస్ లోకి కట్ట కట్టుకొని వెళుతుండడంతో రాజగోపాల్ రెడ్డికి దిక్కుతోచడం లేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది ఒక్క మునుగోడులోనే.. మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. కోమటిరెడ్డి గెలవగానే బీజేపీలోకి చేరతున్నట్టు హల్ చల్ చేశాడు. అనంతరం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాడు. నిలకడలేని కోమటిరెడ్డిపై నమ్మకం లేక తాజాగా ఇప్పుడు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. దీంతో కోమటిరెడ్డి తన మద్దతు దారులను పెద్ద ఎత్తున కోల్పోయాడట.. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తప్ప కాంగ్రెస్ నేతల ఉనికే ప్రశ్నర్థకంగా ఉందట..

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

ఇలా కాంగ్రెస్ పట్టున్న నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డిపై అపనమ్మకంతో నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి చెబుతున్నా ఇప్పుడు ఆ పార్టీకి నల్గొండ జిల్లాలో నూకలు చెల్లినట్టేనని కాంగ్రెస్ వాదులే వాపోతున్నారు. ఇలా కాంగ్రెస్ బలమున్న నల్గొండ జిల్లాలోనే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కావడం నిజంగా విచిత్రమే మరీ..