https://oktelugu.com/

నాగ్ ‘బ‌ర్త్ డే’కి చైతు నుండి ‘థాంక్యూ’!

ఈ రోజు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు. నేటితో నాగ్ 61వ వ‌సంతంలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా అక్కినేని అభిమానుల హృదయాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక నాగ్ బర్త్ డేకి ఆయన అభిమానులు కోసం.. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ నుండే కాకుండా చైతు సినిమాల నుండి కూడా కానుక‌లు అందాయి. వైల్డ్ డాగ్ మూవీ టీమ్ తో పాటు చైతు చేస్తోన్న ల‌వ్ స్టోరి టీమ్ నుంచి ఇప్పటికే కానుక‌లు అందిన సంగతి […]

Written By:
  • admin
  • , Updated On : August 29, 2020 / 01:42 PM IST
    Follow us on


    ఈ రోజు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు. నేటితో నాగ్ 61వ వ‌సంతంలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా అక్కినేని అభిమానుల హృదయాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక నాగ్ బర్త్ డేకి ఆయన అభిమానులు కోసం.. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ నుండే కాకుండా చైతు సినిమాల నుండి కూడా కానుక‌లు అందాయి. వైల్డ్ డాగ్ మూవీ టీమ్ తో పాటు చైతు చేస్తోన్న ల‌వ్ స్టోరి టీమ్ నుంచి ఇప్పటికే కానుక‌లు అందిన సంగతి తెలిసిందే. అయితే వీటినిటి కంటే కూడా తాజాగా శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నాగ్ ఫ్యాన్స్ కి చైతు కొత్త సినిమాతో డీసెంట్ గిఫ్ట్ ఇచ్చింది.

    Also Read: అవిటివాడిగా నారా రోహిత్ !

    యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై విక్ర‌మ్ కె.కుమార్ దర్శకత్వంలో `థాంక్యూ` అనే సినిమా త్వ‌ర‌లో ప్రారంభం అవుతుందని..మేకర్స్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. పైగా అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న 20వ సినిమా ఇది. ఇష్క్‌, మ‌నం, 24 వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను రూపొందించిన విక్ర‌మ్ కె.కుమార్ నుండి ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్‌రాజు ఆధ్వర్యంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రాబోతుంది.

    చైతును ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త‌ స్టైల్లో ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుందని.. పైగా చైతు కోసం విక్ర‌మ్ అదిరిపోయే స్టోరీ తీసుకున్నాడని.. సినిమా మొత్తానికే చైతు క్యారెక్టర్ హైలైట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన క్లాసిక్ మూవీ మ‌నం భారీ విజ‌యం సాధించిన రికార్డ్ గురించి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు చైతు – విక్రమ్ నుండి అలాంటి క్లాసిక్ మూవీ రాబోతోందట. అన్నట్లు త్వ‌ర‌లోనే ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు తెలియనున్నాయి. ఇక ఈ సినిమాలో నాగ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.