TS Planning Department: ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పేద నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రణాళిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ పాటు ఇతర ప్రభుత్వ ఉద్యో గాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగుల కోసం ఓ పుస్తకాన్ని ముద్రించింది. దీనిని సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించింది. అందరికీ ఉపయోగపడేలా ఉన్న ఈ పుస్తకం నిరుద్యోగులకు ఎంతో సహాయపడుతుందని ప్రణాళిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

300 పేజీలతో బుక్.
పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు సామాజిక, ఆర్థిక అంశాలపై పట్టు ఉండే విధంగా 300 పేజీలతో ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖ చిత్రం – 2022’ను ప్రణాళిక శాఖ అందు బాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే ఈ పుస్త కాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. నిరుద్యోగుల కోసం సబ్సిడీపై ఈ పుస్తకాన్ని అందించాలని నిర్ణయించినట్టు ప్రణాళిక శాఖ డైరెక్టర్ ఎస్‌కే.మీరా తెలిపారు. సమగ్ర వివరాలతో ఉండే ఈ పుస్తకాన్ని నిరుద్యోగుల సౌలభ్యం కోసం అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో అందుబాటులో ఉంచనున్నారు.
Also Read: EPFO Pension: ఈపీఎఫ్‌వో ఖతాదారులకు గుడ్ న్యూస్.. పెరగనున్న పెన్షన్..!

రూ.100 సబ్సిడీ..
ప్రణాళిక శాఖ ముద్రించిన పుస్తకాన్ని రూ.100 సబ్సిడీతో విక్రయించాలని ఆశాఖ నిర్ణయించింది. పుస్తకం ముద్రణ ఖర్చు రూ.250 కాగా, దీనిని రూ.150కే నిరుద్యోగులకు విక్రయించనున్నారు. అయితే ఈ రేటు కేవలం జిల్లా కలెక్టరేట్‌లతోపాటు హైదరాబాద్‌లోని గణాంక భవన్ (ఖైరతాబాద్)లో మాత్రమే సబ్సిడీ ఇస్తారని ప్రణాళికా శాఖ వెల్లడించింది. పుస్తకాలు కవాల్సిన నిరుద్యోగులు, ఇతర వివరాల కోసం 9182607890, 8978900832 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది. కాగా, గ్రూప్–1తోపాటు పోలీస్ ఉద్యోగాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని వివిధ కోచింగ్ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లోనే పూర్తి సమాచారం దొరుకుతుందని పేర్కొంటున్నారు. దీనిని చదవడం ద్వారా దోషాలు నివారించడంతోపాటు ప్రభుత్వం నిర్వహించే పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా దీని ఆధారంగానే తయారు చేయడం జరుగుతుందని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే నిరుద్యోగులకు పుస్తకాల కోసం క్యూ కడుతున్నారు.
Also Read:Early Elections In Telangana: ముందస్తు మంత్రాంగం.. త్వరలో తెలంగాణ అసెంబ్లీ రద్దు!
[…] […]
[…] […]