Rishabh Pant Trolled: కొన్ని సిరీస్ ల నుంచి టీమిండియా విపరీత కష్టాలనెదుర్కొంటోంది. ముఖ్యంగా కెప్టెన్సీ పట్టు కోల్పోవడంతో ముఖ్యమైన కప్ లను కోల్పోతోంది. తాజాగా సఫారీలతో జరుగుతున్న సీరీస్ చివరి అవకాశంలా మారింది. ఈ సిరీస్ ల్ ఇప్పటికే రెండు మ్యాచ్ లను కోల్పోయిన టీం ఇండియా మిగతా మ్యాచ్ లు తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు కెప్టెన్సీ లోపమేనని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రిషభ్ పంత్ నిరాశ పర్చడంతో టీం మొత్తం విఫలమైంది. స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయంతో తప్పుకోవడంతో రిష్ ఫంత్ కు అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదన్న వాదన వినిపిస్తోంది.

మొన్నటి వరకు రిషబ్ ఫంత్ భవిష్యత్ కెప్టెన్ అని క్రీడాభిమానులు సంబరపడిపోయారు. ఆయన ఆట తీరు చూసి ఇక మనకు కెప్టెన్సీ కష్టాలు తీరినట్లేనని భావించారు. దీంతో ఆయన జట్టు బాధ్యతలు అప్పజెప్పారు. సౌతాఫ్రికాతో మనవాళ్లు చెడుగుడు ఆడేస్తారని అనుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో అత్యధిక స్కోరు చేస్తారన్నారు. వికట్ కీపర్ గా ఉన్న ఫంత్ కు కెప్టెన్సీగా అవకాశం ఇవ్వడంతో ధోని వారసుడచ్చాడని జేజేలు కొట్టారు.
Also Read: Anushka Shetty Brother: అనుష్క శెట్టి సోదరుడికి ప్రాణభయం
కానీ మైదానంలోకి వెళ్లేవరకు అసలు మ్యాటర్ బయటపడలేదు. పంత్ కెప్టెన్సీ చూస్తుంటే బీ గ్రేడ్ టీమిండియా లా కనిపిస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. రిషభ్ పంత్ కెప్టెన్సీగా తొలిసారి 2020 సిరీస్లో బాధ్యతలు చేపట్టారు. అయితే కెప్టెన్సీగానే కాకుండా బ్యాటింగ్ విషయంలో నూ దారుణంగా విఫలమయ్యాడు. ఫంత్ ఆధ్వర్యంలో ఉన్న భారత్ రెండు మ్యాచ్ లను కోల్పోయింది. మిగతా రెండు మ్యాచ్ లను గెలిస్తే తప్ప సిరీస్ వశం కాదు.

మైదానానికి వెళ్లే ముందు ఆయనపై జట్టు సభ్యులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు స్వేచ్ఛా వాతవరణం దొరికిందని అనుకున్నారు. అయితే రిషబ్ ఫంత్ గ్రౌండ్ లోకి దిగగానే సీన్ మారిపోయింది. నిర్ణయాలు తీసుకోవడంతో తడబడ్డాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు చేయలేక సతమతమవుతున్నాడు. తొలి టీ 20లో యుజ్వేంద్ర చాహల్ తో నాలుగు ఓవర్లు కూడా వేయించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రెండో టీ 20లోనూ పవర్ ప్లేలోనే బాల్ నిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు.
కెప్టెన్సీ హోదాలో ఉన్న ఏ బ్యాటర్ అయినా బాధ్యతయుతంగా ఆడుతారు. ఇక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నిర్లక్ష్యపు షాట్ తో వెనుదిరిగాడు. దీంతో జట్టుకూడా విఫలమైంది. మరోవైపు ఫీల్డింగ్ సెట్ కూడా తన ఆలోచన మేరకు జరుగుతుందా..? లేదా.. అనేది అనుమానమేనని క్రీడా నిపుణులు అంటున్నారు. ఇక హార్టిక్ పాండ్యా లాంటి వారి అజమాయిషీ కాస్త ఎక్కువైంది. దీంతో ఫంత్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫంత్ ను డమ్మీ కెప్టెన్ అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read:Insult To Balayya: పుట్టినరోజు నాడు బాలయ్య కి ఘోరమైన అవమానం