https://oktelugu.com/

Trs vs Bjp vs Congress: తెలంగాణ సర్వే: టీఆర్ఎస్ vs బీజేపీ vs కాంగ్రెస్.. గెలుపెవరిది?

Trs vs Bjp vs Congress: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ప్రతీ చిన్న విషయం ఎందుకు రాజకీయం అవుతోంది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్ముతున్నారా? గులాబీ పార్టీని ఓడించే సత్తా బీజేపీ, కాంగ్రెస్ లకు ఉందా? లాంటి విషయాలపై తాజాగా టీఆర్ఎస్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించిందట.. అందులో షాకింగ్ ఫలితాలు బయటపడ్డట్టు సమాచారం. అధికార టీఆర్ఎస్ ను […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2022 / 10:20 AM IST
    Follow us on

    Trs vs Bjp vs Congress: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు? ప్రతీ చిన్న విషయం ఎందుకు రాజకీయం అవుతోంది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్ముతున్నారా? గులాబీ పార్టీని ఓడించే సత్తా బీజేపీ, కాంగ్రెస్ లకు ఉందా? లాంటి విషయాలపై తాజాగా టీఆర్ఎస్ అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించిందట.. అందులో షాకింగ్ ఫలితాలు బయటపడ్డట్టు సమాచారం.

    revanthreddy, kcr, bandisanjay

    అధికార టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పంతం పట్టింది. మోడీ , అమిత్ షా నుంచి బండి సంజయ్ వరకూ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం వరిధాన్యం సేకరణ నుంచి ప్రస్తుతం సంచలనం రేపుతున్న అత్యాచారాల పంరపర వరకూ కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుగా తెలంగాణ రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా బీజేపీ అధికార టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇది నిత్యం మీడియాలో హైలెట్ అవుతూ ప్రజల దృష్టిలో టీఆర్ఎస్ పై వ్యతిరేక భావన ప్రొజెక్ట్ అవుతోంది.

    Also Read: Somu Veerraju: సోము వీర్రాజుపై కేసు.. కారణం అదేనట? అర్ధరాత్రి అరెస్ట్ కు ప్లాన్?

    -కేసీఆర్ చేయించిన సర్వేలో ఏం తేలింది?
    దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో తెలంగాణలో సర్వే చేసిన కేసీఆర్ కు షాకింగ్ ఫలితాలు వచ్చాయని సమాచారం. పీకే టీం ఇప్పటివరకూ 70 నియోజకవర్గాల్లో సర్వే పూర్తి చేయగా.. అందులో 40 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు తేలిందట.. దీంతో ఇది టీఆర్ఎస్ లో పెద్ద దుమారం రేపుతోంది. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన ఎమ్మెల్యేల స్థానాల్లో నియోజకవర్గంలో అర్థబలం, అంగబలం,. ప్రజల్లో సానుకూలత ఉన్న ప్రత్యామ్మాయ నేతల కేసీఆర్ వడబోత కార్యక్రమం ప్రారంభించినట్టు తెలుస్తోంది. గెలిచే వారికే వచ్చేసారి టికెట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. దీంతో సగం మంది ఎమ్మెల్యేల పోస్టులు ఊడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    ఇక మిగిలిన 40 సీట్ల నివేదికను జూన్ 20లోగా పీకే టీం కేసీఆర్ కు అందజేయనుంది. వారి భవిష్యత్ ఏం కానున్నదన్నది ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోంది. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న కేసీఆర్ సొంత పార్టీ నేతల తప్పులను ఇక ఉపేక్షిస్తే తన పుట్టి మునుగుతుందని.. వచ్చేసారి ఎన్నికల్లో స్టిక్ట్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

    ఈ నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతోపాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను పీకే టీంతో కలిసి కేసీఆర్ పదును పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక కీలకమైన మెయిన్ మీడియా సంస్థల అధిపతులు, వాటి ప్రతినిధులను మచ్చిక చేసుకొని సోషల్ మీడియాను అనుకూలంగా మార్చుకొని వ్యతిరేక రాకుండా చూసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మీడియాతో మాట్లాడే వారి సామర్థ్యాన్ని పరీక్షించి సమర్థులను ఎంపిక చేయడానికి చూస్తున్నారు.

    Trs vs Bjp vs Congress

    -కేసీఆర్ నిర్ణయాలే బీజేపీ అస్త్రం..80 సీట్లు గ్యారెంటీ?
    బీజేపీ తెలంగాణలో దూకుడుగా ముందుకెళుతోంది. వరిధాన్యం సేకరణపై పోరు, ప్రజాసంగ్రామ యాత్ర, అత్యాచారాలపై సంచలన ఆధారాలతో కేసీఆర్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు వచ్చి భరోసా ఇవ్వడంతో ఇక్కడి నేతలు మరింత దూకుడుగా వెళుతున్నారు. ఇక తెలంగాణలోని 117 అసెంబ్లీ సీట్లకు గాను 80-90 సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవలే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు 47మందితో ఢిల్లీలో సమావేశమైన మోడీ ఈ మేరకు సర్వే రిపోర్టును బయటపెట్టినట్టు తెలుస్తోంది. బాగా పనిచేసే కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

    -కాంగ్రెస్ కు 40-50 సీట్లు పక్కానా?
    తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా తగ్గేదే లే అంటోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయ్యాక ఆ పార్టీకి జోష్ వచ్చింది. ప్రజల్లోకి పాదయాత్రలతో నేతలు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తాజా సర్వేలో కాంగ్రెస్ బలంగా పోరాడితే 40-50 సీట్లు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయని తేలింది. అదీ నేతలంతా కలిసికట్టుగా పోరుసలుపుతేనే. టీఆర్ఎస్, బీజేపీలను తట్టుకొని నిలబడితేనే కాంగ్రెస్ కనీస సీట్లు సాధిస్తుందని.. వెనుకబడితే మాత్రం ఇక ఈసారి ఓడిపోతే నిలదొక్కుకోవడం కష్టమేనంటున్నారు. ఇటీవల చింతన్ శిబిర్ లోనూ ముందస్తుగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నేతల్లో జోష్ నింపాలని డిసైడ్ అయ్యారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

    మొత్తంగా ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నా కూడా.. తెలంగాణలో పరిస్థితిని బట్టి అధికార టీఆర్ఎస్ పై వ్యతిరేకత బాగా ఉందని తేలింది. ఎమ్మెల్యేలను మార్చితే కానీ గెలవని పరిస్థితి. మార్చినా గెలుస్తుందో లేదో చెప్పలేం. ఇక అధికారానికి బీజేపీ కాచుకొని కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు దక్కించుకోవడం కష్టమేనని సర్వేలో తేలింది. బీజేపీ సాధించే సీట్లను బట్టి అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎన్ని పంచుకుంటాయన్నది తేలనుంది. ఒకవేళ కేసీఆర్ ఏదైనా మ్యాజిక్ చేస్తే మాత్రం బీజేపీకి తగ్గి టీఆర్ఎస్ కు సీట్లు పెరుగుతాయి. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం తెలంగాణలో టఫ్ ఫైట్ ఉండనుంది.

    Also Read:
    Anam Ramanarayana Reddy: ‘ఆత్మకూరు’లో ఆచూకీ లేని ఆనం.. హైకమాండే దూరం పెట్టిందా?

    Tags