https://oktelugu.com/

Somu Veerraju: సోము వీర్రాజుపై కేసు.. కారణం అదేనట? అర్ధరాత్రి అరెస్ట్ కు ప్లాన్?

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, వైసీపీ మధ్య విబేదాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీని ఎడాపెడా విమర్శిండంతో ఆయనపై కక్ష గట్టిన ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు అదను కోసం ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు వీర్రాజుకు మధ్య జరిగిన ఓ గొడవను ప్రామాణికంగా చేసుకుని ఆయనను అరెస్టు చేయించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అర్థరాత్రి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. దీని కోసం చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 9, 2022 10:05 am
    Follow us on

    Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, వైసీపీ మధ్య విబేదాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీని ఎడాపెడా విమర్శిండంతో ఆయనపై కక్ష గట్టిన ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసేందుకు అదను కోసం ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు వీర్రాజుకు మధ్య జరిగిన ఓ గొడవను ప్రామాణికంగా చేసుకుని ఆయనను అరెస్టు చేయించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అర్థరాత్రి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. దీని కోసం చట్టాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంది. రాస్ట్రంలో ఎన్నోమార్లు పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదాలు జరిగినా అరెస్టుల వరకు మాత్రం వెళ్లలేదు.

    Somu Veerraju

    Somu Veerraju

    ప్రస్తుతం సోము వీర్రాజును అరెస్టు చేయాలని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 353,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించారు. కానీ ఆ సమయంలో సోము వీర్రాజు తన కార్యకర్తలతో వాహనాల్లో రావడంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య గొడవ జరిగింది. దీంతో వీర్రాజుపై కేసు నమోదు చేసినట్లు ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.

    Also Read: Anam Ramanarayana Reddy: ‘ఆత్మకూరు’లో ఆచూకీ లేని ఆనం.. హైకమాండే దూరం పెట్టిందా?

    రాష్ట్రంలో వైసీపీని ఎండగడుతున్న సోము వీర్రాజును ఎలాగైనా నోరు మూయించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యకు దిగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా గండికొట్టే ప్రయత్నంలో భాగంగానే వీర్రాజుపై కేసులు పెడుతున్నట్లు సమాచారం. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేసి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి రాష్ర్టంలో బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    Somu Veerraju

    Somu Veerraju

    బీజేపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు మాత్రం జరగనుందని చెబుతున్నారు. దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ ఇక్కడ ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా ఏపీలో అంత బాగా లేకపోవడంతో సోము వీర్రాజు ఒంటరి పోరాటమే చేస్తున్నారు. దీంతో ఆయన నోరు కట్టాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ కూడా పోటీకి సిద్ధంగా ఉండటంతో ఇక వైసీపీ కి కష్టకాలమనే తెలుస్తోంది. అందుకే రాష్ట్రంలో మరోమారు గెలిచి తీరాలనే ఉద్దేశంతోనే వైసీపీ కుట్రలకు తెర తీస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    సోము వీర్రాజు అరెస్టుకు అర్థరాత్రి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పగలైతే ఆందోళనలు ఉధృతమై గొడవలు జరిగే వీలున్నందున అర్థరాత్రి వీర్రాజును అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. సోము వీర్రాజును అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఓ వైపు బీజేపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ మాత్రం సైలెంట్ గా తాను అనుకున్నది చేసుకుపోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

    Also Read:Mekapati Family: మేకపాటి కుటుంబంలో వేరు కుంపట్లు.. ఆసక్తిగా ఆత్మకూరు ఉప ఎన్నికలు

    Tags