Pawan Kalyan- Ali: రాజకీయాల్లో మిత్రులు శత్రువులు అవుతారు అనేదానికి రీసెంట్ ఉదాహరణ కమెడియన్ అలీ..ఈయన పవన్ కళ్యాణ్ కి ఎంత ఆప్త మిత్రుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అయితే రాజకీయాల్లో మాత్రం తన స్వార్థం చూసుకొని పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడిచాడు..2019 ఎన్నికలలో జగన్ వేవ్ ఉన్నందున జనసేన పార్టీ ని కాదని వైసీపీ పార్టీ లో చేరాడు అలీ..తద్వారా తనకి ఎదో ఒక పదవి వస్తుందని ఆశించాడు.

ముందుగా ఆయన 2019 ఎన్నికలలో రాజముండ్రి నుండి MLA పదవిని ఆశించాడు..కానీ అప్పటికే వేరే అభ్యర్థికి బీ ఫామ్ ఇచ్చేయడం తో ఈసారికి ఆ స్థానం ఇవ్వలేనని..అధికారం లోకి వచ్చిన తర్వాత ఎదో ఒక ముఖ్యమైన పదవిని ఇస్తానని మాట ఇచ్చాడు జగన్..సుమారు మూడున్నర ఏళ్ళు ఎలాంటి పదవి ఇవ్వకుండా అలీ ని ఖాళీగా కూర్చోపెట్టిన జగన్..ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అనే పదవిని ఇచ్చాడు..ఈ పదవి అలికి ఇప్పుడు ఇవ్వడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చెయ్యడమే ప్రధాన లక్ష్యం.
అలీ తనకి జగన్ ఇచ్చిన టాస్కుని విజయవంతంగా పూర్తి చెయ్యడానికి పూనుకున్నాడు..పవన్ కళ్యాణ్ పై విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టడం ప్రారంభించేసాడు..ఇటీవల పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ పార్టీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంఘటనలు మన అందరం చూస్తూనే ఉన్నాము.

దీనిపై అలీ స్పందిస్తూ ‘జగన్ గారి మీద పవన్ కళ్యాణ్ గారు అలా కామెంట్స్ చెయ్యడం సరికాదు..జనాలు జగన్ గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి 151 సీట్లు ఇచ్చారు..ఊరికినే అంత మెజారిటీ ఇవ్వలేదు ఆయనకీ..ఇప్పుడు మూడు రాజధానులు నిర్ణయం కూడా చాలా గొప్పది..ఇందువల్ల రాష్ట్ర అభివృద్ధి గొప్పగా జరుగుతుంది..దీనిని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలి..అభివృద్ధిని వ్యతిరికిస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్స్ అర్థరహితం’ అంటూ కమెడియన్ అలీ చేసి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతోంది.
పవన్ కళ్యాణ్ కి సోల్ మెట్ అని చెప్పుకొని తిరిగే నువ్వు..ఆయన ఎలాంటి మనిషో నీకు తెలియదా..? తెలిసి కూడా ఇలాంటి నాటకాలు ఎందుకు వేస్తున్నావు..నీలాంటి వాడిని నమ్మినందుకు సిగ్గుపడుతున్నాము అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.