Achyuth: అచ్యుత్ పేరు ఇప్పటి వారికి తెలియదు కావచ్చు.. కానీ ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరో స్థాయిలో గుర్తింపు పొందారు. బుల్లితెరపై లేడీ ఫ్యాన్స్ ఉన్న హీరో అచ్యుత్ మాత్రమే. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన అనేక సినిమాల్లో సైడ్ రోల్స్ చేశారు. ఆయనకు ఎన్నడూ హీరో అవ్వాలని కోరిక ఉండేది కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలని కోరిక ఉండేది.‘బావగారు బాగున్నారా..‘, ‘డాడీ’ సినిమాలతో అది కూడా పూర్తయింది. అయితే బుల్లితెరపై అడుగుపెట్టిన అచ్యుత్ ను సినిమాల్లోకి ఎవరు తీసుకొచ్చారు..? ఆయన మొదటి సినిమా ఏదీ..?

ఒకప్పుడు సినిమాల్లోకి రావాలంటే అన్నీ కళలు తెలిసుండాలి. అప్పుడే సినిమాల్లో రాణించేవారు. 1990 దశకంలో చిరంజీవి, బాలకృష్ణ తదితర నటులు ఎంత పెద్ద స్టార్లు అయినా సినిమా కోసం ఎంతో కష్టపడేవాళ్లు. సినిమా సక్సెస్ కావడానికి డైరెక్టర్ చెప్పిన ప్రతీ పనిని చేశారు. అలా కమిట్మెంట్ నటులు అయినందునే ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నారు. వీరి బాటలోనే చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. కానీ వచ్చీ రాగానే ఎవరూ అవకాశాలు దక్కించుకోలేదు. సినిమాల్లో అవకాశాలు రాని వారు టీవీల వైపు వెళ్లేవారు. అలా అచ్చుత్ కూడా సిరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు.
దాదాపు 50కి పైగా సీరియల్స్ లో నటించిన అచ్యుత్ బుల్లితెర కెరీర్లో ‘అంతరంగాలు’, ‘అన్వేషిత’ సీరియల్స్ బాగా పేరు తెచ్చిపెట్టాయి. దీంతో స్మాల్ స్క్రీన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయనకు లేడీ ఫ్యాన్స్ బాగా పెరిగారు. ఆ తరువాత జంధ్యాల డైరెక్టర్ అచ్యుత్ నటనకు పిదా అయి ‘ప్రేమ మందిరం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇందులో హీరోగా కాకపోయినా అచ్యుత్ ఆ తరువాత పలు అవకాశాలు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలతో సమానంగా అచ్యుత్ కు క్యారెక్టర్ అందించేవారు. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ సినిమాలో అచ్యుత్ బాక్సర్ గా నటించి.. తమ్ముడి పై ఉన్న ప్రేమను చాటుకునే వ్యక్తిగా కీలక రోల్ చేశారు.

ఇక ఆయన చిరకాల కోరిక మెగాస్టార్ సినిమాల్లో నటించాలని. అనుకున్నట్లుగానే ఆయనకు ‘బావగారు బాగున్నారా..’‘డాడీ’ సినిమాల్లో అవకాశం వచ్చింది. అయితే డాడీలో అచ్యుత్ మెయిన్ రోల్ పోషించారు. చిరంజీవి స్నేహితుడిగా ఉంటూనే మోసం చేసే వ్యక్తిగా కనిపించాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించిన అచ్యుత్ కు ఆ సినిమా లైఫ్లో గుర్తుండిపోతుందని అప్పట్లో అనేవారు. చివరిగా ఆయన ‘ఒక్కడు’ సినిమాలో కనిపించాడు. ఇందులో భూమిక అన్నయ్యగా కనిపిస్తారు. ఆ తరువాత గుండెపోటుతో మరణించారు.