Nellore Politics: అసలు నెల్లూరులో ఏం జరుగుతోంది? ఇప్పటివరకూ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఎందుకు బయపడుతున్నాయి? అధిష్టాన పెద్దల ఆదేశాలను నేతలు ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? ఈ పోటీ సభలేమిటి? ఒకరి నియోజకవర్గాల్లో ఈ పర్యటనలేమిటి? వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటే పుట్టు మునగడం ఖాయమా?.. సగటు వైసీపీ అభిమానిలో అంతర్మథనం ఇది. గత కొద్దిరోజులుగా నెల్లూరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. వీధి పోరాటాలు, ఒకరి నియోజకవర్గంలో ఒకరి జోక్యం వద్దంటూ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీచేసినా, సున్నితంగా చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు.
ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. తన మంత్రి పదవి లాక్కున్నాడని అక్కసో.. లేకుంటే తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టాడనో.. లేక తనను రాజకీయంగా నిర్వీర్యం చేస్తాడన్న భయమో.. కానీ అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్థన్ రెడ్డిపై రగిలిపోతున్నారు. అమాత్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లాలో అడుగుపెట్టిన కాకానికి ధీటుగా పోటీసభ నిర్వహించి సవాల్ విసిరాడు. అధిష్టాన పెద్దల ఆదేశాలతో నోరు కాస్తా తగ్గించాడు. దీంతో హీట్ తగ్గుతుందని అందరూ భావించిన తరుణంలో ఏకంగా కాకాని ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించి మరో కొత్త సవాల్ విసిరాడు అనిల్. హంగూ ఆర్భాటంతో ఓ నాయకుడి వర్ధంతి కార్యక్రమానికి, యాదవుల కుల దేవత గంగమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించాడు. అనిల్ పర్యటనలో భారీగా స్వాగతాలు, బాణసంచా పేలుళ్లు, భారీగా జన సమీకరణ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రిగా ఉన్నన్నాళ్లూ ఈ నియోజకవర్గం ముఖం చూడని అనిల్ ఇప్పుడు ఏకంగా వ్యక్తిగత కార్యక్రమాలు, పండుగలు, పరామర్శల పేరిట సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Russia occupies Mariupol: మారియుపోల్‌ను ఆక్రమించిన రష్యా.. అమెరికాకు పుతిన్ సీరియస్ వార్నింగ్
అనుమానంతో రగిలిపోతున్నఅనిల్
అనిల్ దూకుడు వెనుక భారీ స్కెచ్ కనిపిస్తోంది. తనను నెల్లూరు సీటీలో చేయకుండా నెల్లూరు పెద్దా రెడ్డిలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారన్న అనుమానంతో అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేస్తూ వీధి పోరాటానికి సై అంటున్నారు. మంత్రివర్గ ఆశావహుడిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి సైలెంట్ కావడం, కాకాని గోవర్థన్ రెడ్డికి సపోర్ట్ చేయడం కూడా అనిల్ లో ఒక్కసారిగా అనుమానాలు రెట్టింపు అయ్యాయి. ఇన్నాళ్లూ మంత్రి పదవి దక్కలేదని బాధతో, ప్రస్టేషన్ తో ఆనం రామనారాయణ రెడ్డి ఉండే వారు. అటువంటి వ్యక్తి అనిల్ ను తప్పించి కాకానికి పదవి ఇచ్చినా పెద్దగా రియాక్ట్ కాలేదు. పైగా సఖ్యతతో మెలుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సీటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి ఆనం కుటుంబీకులను తెరపైకి తేవాలన్నదే ఈ ఒప్పంద సారాంశం. అనిల్ సర్వేపల్లిలో పర్యటన ద్వారా పెద్దా రెడ్డిలకు సవాల్ విసిరారు.
అందుకు ప్రతిగా కాకాని గోవర్థన్ రెడ్డి నెల్లూరు సిటీలో పర్యటించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సిటీలో నివాసముంటున్న ఆనం రామనారాయణరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం అందుకోనున్నారు. అక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో అనిల్ ను ఎలా తెగ్గొట్టాలన్నదానిపై ప్రణాళిక రూపొందించనున్నారు. గేమ్ ప్లాన్ అమలు చేయనున్నారు. ముందుగా అనిల్ వెంట నడుస్తున్నా రెడ్డి సామాజికవర్గ నేతలు, కార్యకర్తలను ఒక తాటిపై తేనున్నారు. అసమ్మతి తెరలేపనున్నారు. ఇప్పటికే అనిల్ వెంట నడిచే ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. కాకాని వర్గంతో పడని వారు సైతం అనిల్ కు దూరంగా ఉన్నారు. ఒక విధంగా అనిల్ ను ఒంటరి చేసి వచ్చే ఎన్నికల నాటికి అచేతనుడిగా చేయాలని కాకాని, ఆనం ద్వయం తెగ ప్రయత్నాలు చేస్తోందట.
అందరూ శత్రువులే..
సాధారణంగా రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. కానీ అనిల్ కుమార్ కు ఆ ఛాన్ష్ లేదు. శత్రువుకు వ్యతిరేకంగా ఉన్న వారు సైతం అనిల్ తో చేతులు కలిపేందుకు మొగ్గు చూపడం లేదు. నెల్లూరు పెద్దా రెడ్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. రాయలసీమ రెడ్ల కంటే వీరు పవర్ ఫుల్. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజకీయాలను శాసించిన సందర్భాలున్నాయి. అటువంటి రెడ్డను తాను మంత్రిగా ఉన్నప్పుడు లెక్క చేయలేదు అనిల్. సీఎం జగన్ అండ చూసుకొని తెగ రెచ్చిపోయారు. అంతర్గత సమావేశాల్లో సైతం తూలనాడారు. నేరుగా బాహాబాహీకి దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. మరోవైపు విపక్ష నేతలతో అంతగా సఖ్యత లేదు. వారిపై సైతం నోరు పారేసుకునేవారు. ఈ పరిణామాలన్నీ తాజాగా అనిల్ కు మైనస్ అయ్యాయి. రాజకీయంగా ప్రతిబంధకంగా మారాయి.
Also Read: Roja: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?