https://oktelugu.com/

Pawan Kalyan- Sampath Nandi: పవన్ తో పూర్తి చేయగలడా ?.. అసలు పవన్ ఛాన్స్ ఇస్తాడా ?

Pawan Kalyan- Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. తన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని తెగ కష్టపడుతున్నాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కోసం దాదాపు మూడేళ్లు సంపత్ నంది కష్ట పడ్డాడు. కానీ, సంపత్ నంది వర్క్ పవన్ కి నచ్చలేదు. దాంతో పవన్ కళ్యాణ్, సంపత్ నందికి డేట్స్ ఇవ్వలేదు. పైగా తన సినిమా నుంచి అతన్ని తప్పించాడు. ఇంత జరిగినా.. […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 07:52 AM IST
    Follow us on

    Pawan Kalyan- Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. తన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాలని తెగ కష్టపడుతున్నాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కోసం దాదాపు మూడేళ్లు సంపత్ నంది కష్ట పడ్డాడు. కానీ, సంపత్ నంది వర్క్ పవన్ కి నచ్చలేదు.

    Pawan Kalyan- Sampath Nandi

    దాంతో పవన్ కళ్యాణ్, సంపత్ నందికి డేట్స్ ఇవ్వలేదు. పైగా తన సినిమా నుంచి అతన్ని తప్పించాడు. ఇంత జరిగినా.. సంపత్ నంది మాత్రం పవన్ కళ్యాణ్ కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ‘భీమ్లా నాయక్’ విడుదలకు ముందు నుంచే సంపత్ నంది.. పవన్ చుట్టూ తిరుగుతున్నాడు.

    ప్రస్తుతం పవన్ ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పైగా పవన్ కి మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఐతే, సంపత్ నంది చెప్పిన కథ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి సంపత్ నంది… ఈ గ్యాప్ లో మరో సినిమా చేసుకొని రావొచ్చు.

    కానీ, పవన్ కళ్యాణ్ తో తాను ప్లాన్ చేసిన సినిమాని పూర్తి చేసిన తర్వాతే మరేదైనా అని పట్టుదలగా ఉన్నాడు సంపత్ నంది. అందుకే, ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తూ కథలో బెటర్ మెంట్స్ చెబుతూ వస్తున్నాడు. అసలు సంపత్ నంది ఇంత పట్టుదలగా ఎందుకు ఉన్నారు చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు కూడా.

    Pawan Kalyan- Sampath Nandi

    కానీ, సంపత్ నంది కారణాలు సంపత్ నందికి ఉన్నాయి. ఐతే, పవన్ తో అసలు ఎప్పుడు సినిమాని మొదలుపెట్టి, ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేస్తారో అనేది చూడాలి. అనేక అడ్డంకుల మధ్య, పుకార్ల మధ్య, కామెంట్స్ మధ్య సంపత్ నంది, పవన్ తో సినిమాని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలడా ?

    ఇంతకీ ఈ సారి అయినా సంపత్ నందికి పవన్ ఛాన్స్ ఇస్తాడా ? చూడాలి. ఒకవేళ, సంపత్ నందిని పవన్ ఇప్పుడు కూడా పక్కన పెడితే అసలుకే మోసం వస్తోంది.

    Recommended Videos:

    Tags