CM REVANTHREDDY :తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయమని ఒకసారి, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ మరోసారి విపక్షాలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందని మొదటి నుంచి ఉన్న సీనియర్లు ఒకవైపు.. రేవంత్ రెడ్డి వైపు మరో వర్గం నిలిచిందని రాజకీయ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. సీనియర్ మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో సీఎం కు సఖ్యత చెడిందని ఓ వర్గం మీడియా ఆరోపిస్తున్నది. అయితే రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి ఇదే అదనుగా పార్టీలో కొందరు సీనియర్లు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీనికి రాష్ర్టంలో మరో పార్టీకి చెందిన కీలక నేత అండదండలు ఉన్నట్లు జోరుగా చర్చసాగుతున్నది. వాస్తవానికి శుక్రవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే. ప్రధాని నరేంద్రమోదీ సహా పెద్ద సంఖ్యలో నేతలు ఆయనకు విషెస్ చెప్పారు. ఇందులో టీడీపీ అదినేత చంద్రబాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్.. ఇలా ఏ ఒక్కరూ రేవంత్ కు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెప్పలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడం తో స్వయంగా రేవంత్ రెడ్డినే ఒక పోస్ట్ పెట్టారు. తనకు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన రాహుల్ గాంధీకి ఆయన థ్యాంక్స్ చెప్పారు.
గత కొంతకాలంగా దూరం
కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ ను కొంత కాలంగా దూరం పెడుతున్నట్లుగా జోరుగా చర్చ సాగుతున్నది. ఇదే క్రమంలో క్యాబినేట్ విస్తరణకు కూడా వారు అనుమతిండం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పాటు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇష్టం చూపలేదని తెలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్ లోనూ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ తో అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లుగా సమాచారం. అయితే కేరళలోని వయనాడ్ లో కూడా ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సీఎం ను అసలు పలకరించలేదని తెలుస్తున్నది.
బీజేపీతో చెలిమిపై అనుమానాలా?
తెలంగాణ సీఎం రేవంత్ బీజేపీతో సఖ్యతగా ఉండడమే అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన పట్ల ప్రధాని మోదీ కూడా సాఫ్ట్ వైఖరి చూపడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఏదేమైనా ఇది కొందరు సీనియర్లకు మాత్రం చెప్పలేనంత సంతోషం కలిగిస్తున్నదట. ఇటీవల పొంగులేటి సంస్థలపై దాడుల విషయంలోనూ ఇదే చర్చ సాగింది. కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నాడనే కారణంతోనే కేంద్రం ఈ దాడులు జరిపించినట్లు దీని వెనుక రాష్ర్టంలో ఓ కీలక నేత హస్తం ఉందని చర్చ సాగింది.
ఏదేమైనా తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాననే ఆనందం, సంతృప్తి ఏడాది కూడా లేకుండా పోతున్నట్లున్నది సీఎం రేవంత్ రెడ్డికి. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలే కొట్టిపారేయడం లేదు. సీనియర్లు కూడా ఎప్పుడు ఆ పీఠం ఎక్కుదామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. మరి అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉందో త్వరలోనే తేలనుంది.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cm revanths supremacy is the brs campaign true
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com