
కరోనా మహమ్మరి విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆగమాగం చేస్తున్న వాళ్లకు కరోనా సోకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాపం పెట్టారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఆయన రోటిన్ కు భిన్నంగా వారికి కరోనా శాపించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పలువురు చేస్తున్న వికృత ప్రచారం కేసీఆర్ కు కోపం తెప్పించడం వల్లనే ఆయన అలా అని ఉంటారని అర్థంమవుతోంది. వీరిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.
కరోనాతో ప్రపంచం ఆగమాగం అవుతున్న సమయంలోనూ కొందరు చిల్లర ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను ఎవరూ పట్టుకోరనే భ్రమలో ఉన్నారని.. అలాంటి వాళ్లను ప్రభుత్వం పట్టుకుంటుందని స్పష్టం చేశారు. వీరికి వందరెట్ల కఠిన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం చేసే వాళ్లందరికీ కరోనా సోకుతుందన్నారు. ఆ దుర్మార్గులకు ఈ వైరస్ కచ్ఛితంగా సోకాలని శాపించారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు..
తెలంగాణలో ఆదివారం నాటికి 70కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇందులో ఒకరు ఇప్పటికే ఒకరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మరో 11మందికి టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని పేర్కొందన్నారు. వీరికి మరోసారి టెస్టు నిర్వహించిన త్వరలోనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వం, వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
ఏప్రిల్ 7వరకు తెలంగాణలో కరోనా కేసులు సున్నాకు చేరే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా వైరస్ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. అయితే కేసీఆర్ పెట్టిన శాపం ఈ డిజిటల్ యుగంలో ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే..