రాష్ట్రం బాగుండాలనుకుంటే.. ఇంట్లోనే ఉండండి

దేశమంతా కరోనా ప్రకంపనలు మిన్నంటిన వేళ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. వ్యాధిని నిరోధించడానికి ప్రభుత్వం సూచించే అదే శాలు పాటించి అధికారులకు సహకరించాలని ఆయన పిలుపుని చ్చారు. కరోనా – నివారణ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర భవిష్యత్తు ప్రజలపై ఆధారపడి ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు అమెరికా, […]

Written By: Neelambaram, Updated On : March 30, 2020 12:46 pm
Follow us on

దేశమంతా కరోనా ప్రకంపనలు మిన్నంటిన వేళ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. వ్యాధిని నిరోధించడానికి ప్రభుత్వం సూచించే అదే శాలు పాటించి అధికారులకు సహకరించాలని ఆయన పిలుపుని చ్చారు. కరోనా – నివారణ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర భవిష్యత్తు ప్రజలపై ఆధారపడి ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు అమెరికా, ఇటలీ దేశాలు దెబ్బతిన్నాయన్నారు. మన రాష్ట్రానికి అలాంటి పరిస్థితులు రాకూడదంటే ప్రజలు పగడ్బందీగా లాక్‌ డౌన్‌ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని, సర్పంచులు, తాజా మాజీ కౌన్సిలర్లు తమ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేయాలని పేర్కొన్నారు. పోలీసులు విచ్చలవిడిగా సంచరిస్తున్న పౌరులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.

ఇప్పటి వరకు జిల్లాలోని మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిపై చిలుకు లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌ మందును కొనుగోలు చేసి గ్రామ పంచాయతీలకు పంపి ట్రాక్టర్ల సహాయంతో స్ప్రే చేస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రజలందరూ సహకరించి అధికారుల నిబంధనలను పాటించి ఇంటి వద్దనే ఉండాలని, ఉదయం మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలని మంత్రి తెలిపారు.