తాజాగా రాసిన కొత్తపలుకులో రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటి సందేశాన్ని రాధాకృష్ణ ప్రవచించాడు. ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డి ప్రమేయం ఏమీ లేదని.. అదంతా కేసిఆర్ కుట్ర అని రాధాకృష్ణ తేల్చాడు.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును రెండు నెలల క్రితమే అప్పటి సీఎం కేసీఆర్ వేములవాడ టికెట్ ఇవ్వకుండా, ఆయనను వ్యవసాయ శాఖకు చీఫ్ ఎడ్వైజర్‌గా నియమించారు.
కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్సపై యశోద ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో ఆయనకు నిర్వహించిన సర్జరీ విజయవంతం అయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
శనివారం ఉదయం తొమ్మిదిగంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది.
తెలంగాణ శాసనసభ నూతన ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అత్యధికంగా 8 సార్లు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మధ్యాహ్నం యశోద ఆస్పత్రి వైద్యులు కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇందులో కేసీఆర్ కాలుకు మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయినట్లు వెల్లడించారు.
గురువారం సాయంత్రం అసెంబ్లీ సమావేశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అర్ధరాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బాత్రూంలో జారిపడ్డారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన 2023 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు.
ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఆరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే ఫలితాల ట్రెండ్ తెలియడంతో కెసిఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేశారు.
రేవంత్ అదృష్ట సంఖ్య 9 అనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. కేసీఆర్ వాహనాలన్నింటిపైనా 6 ఉంటే.. రేవంత్ వాహనాలపై 9 ప్రధానంగా ఉంటుంది. కానీ.. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఈసారి ఆయనకు కలిసిరాలేదు.