CM KCR Maharashtra Tour: జాతీయ రాజకీయాల కోసం ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఫక్తు రాజకీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా మార్చారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అయితే జాతీయ రాజకీయాలు మొదలు పెట్టిన గులాబీ బాస్ పార్టీని వేగంగా విస్తరించలేకపోతున్నారు. కేవలం తెలంగాణ పొరుగున్న ఉన్న మహారాష్ట్రలోనే పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. ఈమేరకు నాలుగైదుసార్లు మహారాష్ట్రలో పర్యటించి సభలు నిర్వహించారు. పార్టీ కార్యాలయాలనూ ప్రారంభిస్తున్నారు. అక్కడి వివిధ పార్టీల నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. అయితే వాళ్లు స్వచ్ఛందంగా చేరుతున్నారా.. లేక గులాబీ బాస్ ఏదైనా ఆశ చూపుతున్నారా.. తాయిలాలు ఇస్తున్నారా అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు లేకపోయినా మహారాష్ట్ర నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడమే ఈ అనుమానాలకు కారణం.
తాజాగా మళ్లీ మహారాష్ట్రకు..
మహారాభారత్ రాష్ట్ర సమితి బలోపేతానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కె.చంద్రశేఖర్రావు తాజాగా రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. షోలాపూర్లో రాత్రి బస ఆనంతరం మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతోపాటు వివిధరంగాలు, వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్థాని కంగా జరిగే బీఆర్‌ఎస్ సభలో మాట్లాడతారు. ఈ సభలో ఎన్సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ ఖాల్కే కుమారుడు భగీరధ్ భాల్కే.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. మధ్యాహ్నం తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్క డికి సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) ఎయిర్ పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ కు వస్తారు.
భారీ కన్వాయ్‌తో.. రోడ్డు బార్గంలో..
సీఎం కేసీఆర్ సోమవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు బయల్దేరనున్నారు. 700 వాహనాలతో కేసీఆర్ మహారాష్ట్ర ప్యటనక వెళ్లనున్నట్లు సమాచారం. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకోనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ సుమన్, మాజీ ఎంపీ వేణుగోపాలచారి.. మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలతో కలిసి సమన్వయం చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొండ్లే, బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర శాఖ కన్వీనర్ మాణిక్ కదమ్ పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో..
తెలంగాణ మలిదశుద్యమ సమయంలో భారీ కార్లర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అందరి దృష్టినీ ఆకర్షిచారు కేసీఆర్. తాజాగా మహారాష్ట్రలోనూ అదే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 65వ నంబరు జాతీయ రహదారి పొడవునా ప్లెక్సీలు, స్వాగత తోరణాల ఏర్పా టు చేశారు. ఎక్కడికక్కడ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. భారీ వాహన కాన్వాయ్‌లో పలువురు మంత్రులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు సీఎం వెంట వెళ్లనున్నారు.
రోడ్డు మార్గంలో 315 కిలోమీటర్లు..
గత ఏడాదిలో బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, నాగపూర్‌తోపాటు మరో రెండు ప్రాంతాల్లో సభ నిర్వహించారు. తాజాగా సోమవారం 700 వాహనాల కాన్వాయ్‌తో 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్రకు బయల్దేరుతారు. హైదరాబాద్ నుంచి మొత్తం సుమారు 315 కిలో మీటర్ల రోడ్డు ప్రయాణానంతరం రాత్రి 10 గంట లకు అక్కడికి చేరుకుంటారు.