Vande Bharat Express Toilet: రైళ్లలో చిత్ర విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. మెట్రో రైళ్లలో యువతీ యువకులు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల ఓ యువతి మెట్రోలో హేర్‌డ్రై చేసుకుంటూ కనిపించింది. ఓ ప్రేమ జంట రైళ్లో ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. తాజాగా వందేభారత్ రైలు మరుగు దొడ్డిలో ఓ వ్యక్తి నాలుగు గంటలు ఉండిపోయాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.
275 కిలోమీటర్లు ప్రయాణం..
కేరళలో తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కిన ఓ వ్యక్తి మరుగుదొడ్లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో టికెట్ తీసుకోకుండా ఈ రైలు ఎక్కిన సదరు వ్యక్తి గంటల తరబడి మరుగుదొడ్డిలోనే ఉండిపోయాడు. ఎంత పిలిచినా బయటకు వచ్చేందుకు ససేమిరా అన్నాడు. దాదాపు 275 కిలోమీటర్లు ప్రయాణించాడు.
శోర్‌నూర్ స్టేషన్‌కు చేరాక..
ప్రయాణికులు ఎంత పిలిచినా మరుగుదొడ్డి తలుపు తీయకపోగా, గంటల తరబడి అందులోనే ఉండిపోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మరుగుదొడ్డిలో ఏమైనా చేసుకుని ఉంటాడని అనుమానించారు. కానీ రైలు శోర్‌నూర్ స్టేషన్‌కు చేరుకున్నాక రైల్వే పోలీసులు వచ్చారు. బయటకు రావాలని ఎంత పిలిచిన స్పందన రాలేదు. దీంతో పోలీసులు తలుపు విరగ్గొట్టి అతన్ని బయటక తీసుకువచ్చారు.
ఎవరో తరిమారని..
టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కిన సదరు వ్యక్తిని పోలీసులు విచారణ చేశారు. గంటల తరబడి మరుగుదొడ్లో ఉండడానికి కారణాలు ఆరా తీశారు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఎర్రటి టీషర్టు ధరించి భయం భయంగా చూస్తున్న ఆ వ్యక్తి హిందీ మాట్లాడుతున్నాడని పేర్కొనానరు. తనను కొంతమంది తరుముకొంటూ వచ్చారని, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరుగుదొడ్లోకి దూరి గడియ వేసుకున్నట్లు తెలిపాడు. అయితే తన స్వగ్రామం ఎక్కడ… ఎందుకు తరిమారు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. టికెట్ తీసుకోకపవడంతో టీటీ నుంచి తప్పించుకుందుకే ఇలా గంటల తరబడి రైలు మరుగుదొడ్డిలో ఉండిపోయి ఉంటాడని ప్రయాణికులు పేర్కొంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని ఆర్పీఎఫ్ పోలీసుతెలిపారు. ప్రస్తతానికి సదరు వ్యక్తి తమ అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎక్కడ ఎక్కడు.. ఎక్కడికి వెళ్తున్నాడు.. తరముకొచ్చినట్లు చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా అని ఆరా తీస్తున్నారు.