Rythu Bandhu: నేటి నుంచే రైతుబంధు.. అకౌంట్లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది. 10వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ అయ్యాయి. యథావిధిగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి.

Written By: Raj Shekar, Updated On : June 26, 2023 5:13 pm

Rythu Bandhu

Follow us on

Rythu Bandhu:  రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు మళ్లీ రాబోతోంది. పదకొండో విడుత సాయం జూన్‌ 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి వర్షాలు ప్రారంభమైనందున అన్నదాతలకు రెండు దశల్లో పంట సహాయం అందించనున్నట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్‌ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనుంది. పదకొండో విడతలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధుసాయం అందజేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈసారి 1.5 లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అందించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మొత్తం 1.54 కోట్ల ఎకరాలకు రూ.7,720.29 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది. ఈ ఏడాది 5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు రైతుబంధు సాయం అందనుంది.

రూ.300 కోట్లు అదనపు భారం..
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది. 10వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ అయ్యాయి. యథావిధిగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి. ముందుగా ఎకరంలోపు భూమి ఉన్న వారికి 2 ఎకరాలు, 5 ఎకరాలు, 11వ విడత పూర్తయిన తర్వాత అర్హులైన రైతులకు పంట నగదు సాయం అందుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని, ఇందుకోసం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

జూన్‌ 30న పోడు పట్టాల పంపిణీ..
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోడు రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. జూన్‌ 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఒకే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పోడు పట్టా పంపిణీ అనంతరం.. వారికి రైతుబంధు కూడా అందజేస్తామన్నారు.

రైతు బంధు అర్హుల జాబితాలో మీరు ఉన్నారా..

అధికారిక వెబ్‌సైట్
http://rythubandhu.telangana.gov.in/
వెబ్ సైట్‌కి వెళ్లండి

హోం పేజీలో రైతు బంధు స్కీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి

అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ (Cheque Distribution Venue Schedule) మీద క్లిక్ చేయాలి

ఆ తరువాతి పేజీలో మీ జిల్లా (District), మండలం (Mandal) సెలక్ట్ చేసుకుంటే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది

అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకుంటే సరిపోతుంది

రైతు బంధు నగదు జమ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ https://treasury.telangana.gov.in/ కు వెళ్లండి

హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి

అనంతరం రైతు బంధు అందుకునే సంవత్సరం, టైప్, పీపీబి నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి

స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాలి

వివరాలు మొత్తం ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు.