KCR- Etela Rajender: టీఆర్ఎస్ లో మార్పులు రానున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో ఎక్కువ మంది పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. జంప్ జలానీలను పట్టుకోవాలని భావిస్తోంది. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతతో పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని వారిని బీజేపీలో కలుపుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి ఇప్పటికే కార్యాచరణ పూర్తయింది. ఇక పార్టీపై వ్యతిరేకంగా ఉన్న వారిని గుర్తించి పార్టీలో చేర్చుకోవడమే మిగిలి ఉందని సమాచారం.
గతంలలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ బాధ్యతను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పెట్టినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో అందరి గురించి తెలిసిన వాడిగా పార్టీపై ఆగ్రహంతో ఉన్న వారిని గుర్తించి వారిని మన పార్టీలోకి తీసుకొచ్చే గురుతర బాధ్యతను అప్పగిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈటల అప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అసంతృప్తులను బుజ్జగించి పార్టీలో చేర్చుకునే విధంగా ఈటల కు మార్గనిర్దేశం చేశారు. దీంతో గులాబీ బాస్ కు కలవరం పట్టుకుంది.
Also Read: AP Govt On Debts: ఏపీ అప్పుల కుప్పపై షాకింగ్ లెక్కలు బయటపెట్టిన కేంద్రం
ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరికి టికెట్లు రావనే ప్రచారం జోరుగా సాగుతున్నందున వారిని తమ వైపు లాక్కోవాలని మంత్రాంగం పన్నినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువవుతోంది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. పార్టీలో అసంతృప్తులుగా ఉన్న వారెవరనే దానిపై టీఆర్ఎస్ కే స్పష్టమైన ఆలోచన లేకపోవడంతో బీజేపీ ఎవరిని తన వైపు తిప్పుకుంటుందో అనే బెంగ పట్టుకుంది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఎవరిని తమ వైపు తిప్పుకునేందుకు గాలం వేస్తారో అంతుచిక్కడం లేదు.
కేసీఆర్ ఆలోచన పూర్తిగా తెలిసిన వాడిగా ఈటల రాజేందర్ కేసీఆర్ వ్యూహాలను పక్కాగా కనిపెట్టి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈటల గోలతో కేసీఆర్ కు నిద్ర కూడా పట్టడం లేదు. ఎక్కడ తమ వారిని బీజేపీలో చేర్చుకుంటారోననే అనుమానం కలుగుతోంది. దీనికి తోడు ఈటల కేసీఆర్ ప్లాన్లు పక్కాగా కనిపెట్టే వాడిగా కేసీఆర్ కు లేనిపోని అపోహలు వస్తున్నాయి. దీంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు.