Homeజాతీయ వార్తలుCM KCR: బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్? వరిని వాడుకుని పన్నాగాలు పన్నుతున్న సీఎం?

CM KCR: బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్? వరిని వాడుకుని పన్నాగాలు పన్నుతున్న సీఎం?

CM KCR:  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇరు పార్టీల్లో అభిప్రాయ భేదాలు పొడచూపుతున్నాయి. ప్రస్తుతం అవి తారాస్థాయికి చేరాయి. సీఎం కేసీఆర్ బీజేపీని రాబోయే ఎన్నికల్లో బలోపేతం కాకుండా చేసే ఉద్దేశంతోనే బీజేపీని టార్గెట్ చేసుకుని రాద్దాంతం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్నాళ్లుగా పట్టించుకోకుండా ఉన్న కేసీఆర్ హుజురాబాద్ ఓటమి తరువాత ఒక్కసారిగా వ్యూహం మార్చారు. ఇక లాభం లేదు బీజేపీ బలపడితే తమ అధికారం అందకుండా పోతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసమే బీజేపీని లక్ష్యంగా చేసుకుని పోరాటానికి దిగినట్లు చెబుతున్నారు.

CM KCR
CM KCR

వరి విషయంలో రెండు పార్టీల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో కేసీఆర్ తన వ్యూహం మార్చి మరోమారు బీజేపీని టార్గెట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే ఎన్నికల వరకు కూడా బీజేపీని రాష్ర్టంలో ఎదగనీయకుండా చేసే ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్ పలు మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు. దీని కోసం ఏ రకమైన వైఖరి ఆలోచిస్తారో కూడా అర్థం కావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బీజేపీని రాష్ర్టంలో బలోపేతం కాకుండా చూడటమే ఉద్దేశంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Also Read: Telangana: తెలంగాణకు 9, ఏపీకి 10.. సుపరిపాలనలో రెండు స్టేట్లకు ఆసక్తికరమైన సూచీలు

కేంద్రం విధానాలను ఎండగడతామని గతంలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కనీసం వారి అపాయింట్ మెంట్ కూడా అడగకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. కానీ బీజేపీని మాత్రం రాష్ర్టంలో ప్రత్యామ్నాయం కాకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. హుజురాబాద్ లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా చివరకు మిగిలింది పరాజయమే కావడంతో ఇక లాభం లేదనుకుని బీజేపీ పై యుద్ధం ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇదే విధానాలు కొనసాగితే రాష్ర్టంలో కాంగ్రెస్ బలహీనపడి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేసీఆర్ ఇక రాష్ర్టంలో బీజేపీకి బలం లేకుండా చేయాలని వ్యూహాలు రచిస్తున్నట్లు చెబుతున్నారు. దీని కోసమే కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు చెబుతున్నా అంతర్లీనంగా బీజేపీని బదనాం చేయడమే టార్గెట్ గా కనిపిస్తోంది.

Also Read: Congress War: అయితే రేవంత్ రెడ్డి.. లేదంటే జగ్గారెడ్డి?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version