Site icon OkTelugu

POCO X8 price and features: POCO సరికొత్త మొబైల్స్.. ఫీచర్స్ సూపర్.. ధర ఎంతో తెలుసా..?

POCO X8 price and features

POCO X8 price and features

POCO X8 price and features: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి మొబైల్ తప్పనిసరిగా మారింది. అయితే కొందరు ఖరీదైన ఫోన్లో కొనుగోలు చేస్తుండగా.. మరికొందరు లో బడ్జెట్ ఫోన్లో పై ఆసక్తి చూపుతున్నారు. అయితే బడ్జెట్ ను బట్టి ఫోన్ల ధరలు ఉంటాయని కొంతమంది భావన. కానీ కొన్ని కంపెనీలు తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తూ మార్కెట్లోకి తీసుకువస్తాయి. Xiaomi కంపెనీకి అనుబంధంగా ఉన్న POCO కొత్త మొబైల్స్ ను లాంచ్ చేసింది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండనుంది. అంతేకాకుండా కెమెరా పనితీరు కూడా నాణ్యంగా ఉండడంతో చాలామంది ఈ ఫోన్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే దీని వీటి ధరలు ఎలా ఉన్నాయంటే?

POCO కంపెనీ లేటెస్ట్ గా X8 సిరీస్ కలిగిన మూడు ఫోన్లను రిలీజ్ చేసింది. POCO X8 Pro, X8 Pro Max, POCO X8 Iron Man అనే ఫోన్లను వినియోగదారులకు పరిచయం చేసింది. వీటిలో కొన్ని ఫీచర్స్ కామన్ గా ఉండగా.. మరికొన్ని మాత్రం ప్రత్యేకంగా కలిగి ఉన్నాయి. వీటిలోని POCO X8 Pro మొబైల్లో 6.59 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే 3,500 నిట్స్ బ్రైట్నెస్ తో పనిచేయడం వల్ల ఎలాంటి వాతావరణం లోనైనా అద్భుతమైన కాంతిని అందిస్తుంది. ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రొసీజర్ ఉండగా.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆదారిత సాఫ్ట్వేర్ తో పనిచేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేసేవారు ఈ మొబైల్ లో ఎంచుకోవచ్చు. ఇందులో 8 GB రామ్ ఉండగా 256 స్టోరేజ్ ను చేర్చారు. అలాగే 12gb రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది.

ఈ మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండగా..8 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా పనిచేస్తుంది. 20 MP పండు ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ఈ మొబైల్ లో 6500 mAh బ్యాటరీ ఉండగా ఇది 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేస్తుంది. ఈ మొబైల్ ధర రూ.29,999 ప్రారంభ ధర నుంచి రూ.32,999 వరకు విక్రయిస్తున్నారు.

POCO X 8 Pro Max మొబైల్ డిస్ప్లే 6.83 అంగుళాల AMOLED తో పనిచేస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే 3500 nits బ్రైట్నెస్ తో ఉండనుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్వేర్ తో పనిచేసే ఈ మొబైల్లో POCO X8 Pro ఉండే కెమెరా ఫీచర్స్ ఉండనున్నాయి. అయితే ఇందులో 9000 mAh పర్ఫామెన్స్ తో ఉండగా.. ఈ బ్యాటరీకి 100 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ధర రూ.39,999 ప్రారంభ నుంచి రూ.43,999 ధర వరకు విక్రయిస్తున్నారు.

Exit mobile version