https://oktelugu.com/

CM kCR: దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ ‘తెలంగాణే’

రాష్ర్టం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్ర ఫలాలను అందరికి పంచాలని సూచించారు. రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడేళ్ల కాలంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 2013-14లో రాష్ర్ట స్థూల ఉప్పత్తి […]

Written By: , Updated On : August 15, 2021 / 02:05 PM IST
Follow us on

TS CM KCR

రాష్ర్టం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్ర ఫలాలను అందరికి పంచాలని సూచించారు. రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏడేళ్ల కాలంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 2013-14లో రాష్ర్ట స్థూల ఉప్పత్తి రూ.4,51,580 కోట్లు. 2020-21లో అది రూ.9,80,407 కోట్లు. కరోనా కాలంలో కూడా అభివృద్ధి ఆగలేదన్నారు. 2013-14లో తలసరి ఆదాయం రూ.1,12,126. నేడు అది రూ.2,37,632. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ర్ట తలసరి ఆదాయం రెట్టింపుగా ఉంది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంాణ ప్రథమ స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడినప్పుడు విద్యుత్ సామర్థ్యం 7,798 మెగావాట్లు. ప్రస్తుతం 16,425 మెగావాట్లకు పెరిగింది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. రాష్ర్ట తలసరి విద్యుత్ ఆదాయం 2012 మెగావాట్లకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో స్టేట్ ది దేశంలోనే మొదటి స్థానం. నల్గొండ జిల్లాలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ అతిపెద్ద అల్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పారు.

దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందన్నారు. 2013-14లో రాష్ర్టంలో 49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 2020-21లో కోటి 6 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతోంది. పత్తి సాగులో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ర్టంలోని ప్రభుత్వ కొవిడ్ కేంద్రాల్లో 27,996 పడకలు అందుబాటులో ఉన్నాయి. 17,114 పడకలను ఆక్సిజన్ పడకలుగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ పరిధిలో 224 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామన్నారు.