https://oktelugu.com/

Prabhas Birthday: మహేష్, పవన్ కళ్యాన్.. నెక్ట్స్ ప్రభాస్ దే..

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్అయిన ‘సర్కారివారి పాట’ బ్లాస్టర్ అదరిపోయేలా ఉంది. ఆయన ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఈ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించి పెట్టింది. ఇక తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అప్డేట్ అదిరిపోయేలా ఉంది. పవన్-రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీకి ‘బీమ్లా నాయక్’గా పేరు ఖరారు చేసి ఒక ఫైట్ సీన్ లో పవన్ లుంగీ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 15, 2021 / 02:06 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్అయిన ‘సర్కారివారి పాట’ బ్లాస్టర్ అదరిపోయేలా ఉంది. ఆయన ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఈ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ సాధించి పెట్టింది.

    ఇక తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అప్డేట్ అదిరిపోయేలా ఉంది. పవన్-రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీకి ‘బీమ్లా నాయక్’గా పేరు ఖరారు చేసి ఒక ఫైట్ సీన్ లో పవన్ లుంగీ కట్టుకొని వీరావేశంతో వస్తున్న గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది.

    వారం వ్యవధిలోనే టాలీవుడ్ అగ్రహీరోలు మహేష్, పవన్ ల నుంచి రెండు లేటెస్ట్ టీజర్ లు రావడంతో అంతటా ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చేసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ అప్టేట్స్ తోపాటు మరో రెండు ముఖ్యమైన సినిమాలకు సంబంధించిన సర్ ప్రైజ్ లు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

    రాధేశ్యామ్ టీజర్ తోపాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని సినిమా అప్డేట్, ఇక హిందీలో ఓంరావత్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆదిపురుష్’ సిినమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీకి సంబంధించిన సరికొత్త స్టిల్స్ దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

    ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోజున ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.