Homeజాతీయ వార్తలుCM KCR: కిషన్‌రెడ్డి మొగోనివైతే ధాన్యం ఎంతకొంటారో చెప్పాలి! తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్‌

CM KCR: కిషన్‌రెడ్డి మొగోనివైతే ధాన్యం ఎంతకొంటారో చెప్పాలి! తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్‌

CM KCR: ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్‌ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం మరోసారి సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్రం తీరును ఎండగట్టారు. కేంద్రం యాసంగిలో ధాన్యం కొనబోమని చెప్పిన నేపథ్యంలో తమ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను యాసంగిలో ఏర్పాటు చేయబోమని తేల్చిచెప్పారు. రైతులెవ్వరూ వరి వేయొద్దని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ధాన్యం కొనబోమని చెప్పేది వాళ్లేనని, పైగా ధర్నాలకు దిగేది వాళ్లేనని, దేశంలో 700 మంది రైతులను పొట్టనపెట్టుకున్నది బీజేపీ పార్టీ అని గరమయ్యారు.
KCR
సీఎం కేసీఆర్‌ తాజాగా రాష్ట్ర కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. వరి సేకరణ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ధర్నాలు, దీక్షలు.. కేంద్రంపై కొట్లాట వ్యాఖ్యలు.. ఇలా.. అన్ని అంశాలపైనా.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం.. కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును.. కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని చెప్పేస్తున్నారు. యాసంగిలో తీసుకునేది లేదన్నారు. రా రైస్‌ ఎంత తీసుకుంటారో చెప్పలేదని, మెడలపై కత్తిపెట్టి లేఖ రాయించుకున్నారని, కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని, కేంద్ర ప్రభుత్వం కోట్ల మంది ప్రయోజనాలు కాపాడాల్సిందిపోయి చిల్లర కొట్టు యజమానిగా వ్యవహరిస్తోందని అన్నారు. లాభనష్టాలను అంచనా వేస్తూ ధాన్యం కొనబోమని చెబుతోందని, రాజ్యాంగబద్ధంగా ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.

Also Read: Karimnagar MLC seat: కేసీఆర్ లో భయం.. కరీంనగర్ ఎమ్మెల్సీ సీటు కోల్పోనుందా?

కేంద్రం తమ బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్రాల మీద నిందలు మోపుతోందన్నారు సీఎం కేసీఆర్‌. ఇటీవల పెట్రోల్‌ ధరలపైనా అలాగే మాట్లాడారని, బాయిల్డ్‌ రైస్‌ విషయంలో కేంద్రం లేఖ రాయించుకుందని, ఇది రాష్ట్రాల మెడలపై కత్తి పెట్టి రాయించుకుందని, రాష్ట్రాలు ఇష్టపూర్వకంగా ఇచ్చిందని కాదని చెప్పుకొచ్చారు. యాసంగిలో వచ్చేదే బాయిల్డ్‌ రైస్‌ అని, ఇక్కడి వాతావరణంలో వానాకాలంతో పోలిస్తే సగం రైసే వస్తుందని, 35 డిగ్రీల వాతావరణంలో ధాన్యంలో నూక తప్పనిసరిగా వస్తుందని, ఇది కొంటారో కొనరో చెప్పకుండా తాత్సారం చేస్తున్నారని దెబ్బిపొడిచారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో కొట్లాడి ధాన్యం కొనిపించాల్సింది పోయి అవగాహనా రాహిత్యంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, కిషన్‌ రెడ్డికి దమ్ముంటే.. ఆయన బాయిల్డ్‌ రైస్‌ కొనేలా చేయాలని సవాల్‌ విసిరారు. కేంద్రం నిజంగా రైతు పక్షపాతి ప్రభుత్వమే అయితే.. ధాన్యం సేకరించేలా కిషన్‌ రెడ్డి సూచించాలని, అవసరమైతే పోరాటం చేయాలని, తెలంగాణ రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: Twitter CEO Indian: ట్విట్టర్ కు మనోడే.. ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన భారతీయులు వీళ్లే..

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular