Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ కి లౌక్యం లేదు. ఏ హీరోకి లేని అవకాశం మొదట కళ్యాణ్ రామ్ కి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాకముందే హీరో అయ్యే అవకాశం కళ్యాణ్ రామ్ కి వచ్చింది. కానీ, దాన్ని ఉపయోగించుకోలేక పోయాడు. సరే.. హీరో అయ్యాక అయినా, టాప్ డైరెక్టర్స్ తో పని చేసే అవకాశం కెరీర్ స్టార్టింగ్ లోనే ఉంది. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం తన సినిమా జర్నీని తన స్థాయిని కొంతవరకే పరిమితం చేసుకున్నాడు.

అల్లు రామలింగయ్య లాంటి కమెడియన్ మనవడు బన్నీనే తన ఎంట్రీ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో చేస్తే.. ఎన్టీఆర్ మనవడు అయిన కళ్యాణ్ రామ్ మాత్రం మొదటి నుంచి చిన్నాచితకా దర్శకులతోనే తన సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. అందుకే, ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా తనకంటూ స్థిరమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు. అలాగే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోలేకపోయాడు.
అదేంటో గానీ, ఫస్ట్ నుంచి కళ్యాణ్ రామ్ కెరీర్ సినిమాటిక్ గానే సాగింది. హమ్మయ్యా ఒక హిట్ వచ్చిందిలే అని అనుకునే లోపే వరుసగా నాలుగైదు ప్లాపులు వచ్చేస్తాయి. ప్లాప్ లు రావడంతో కళ్యాణ్ రామ్ కెరీర్ పైకి వెళ్ళాల్సింది పోయి, మళ్ళీ మొదటికి వచ్చేస్తోంది. దీనికితోడు ఆ ప్లాప్ అయ్యే చిత్రాలను ఏరికోరి మరీ తన బ్యానర్ లోనే నిర్మిస్తాడు.
పోనీ, తనకు సినిమాలు సెట్ కావడం లేదు కదా, నిర్మాతగా బిజీ అవుదాం అని ఆ మధ్య రవితేజతో కిక్ 2 చేశాడు. ఆ సినిమా నష్టాలు తీర్చలేక చివరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీగా ఒక సినిమా చేయాల్సి వచ్చింది. మొత్తమ్మీద కళ్యాణ్ రామ్ ఏమి చేసినా, ఏ ప్రయోగం చేసినా అది ఆయనకు దారుణమైన ఫలితాన్నే ఇచ్చింది.
Also Read: Parugu Heroine Sheela Kaur: ‘పరుగు’ హీరోయిన్ ఇప్పుడే పరిస్థితుల్లో ఉందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకోవడానికి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు పోతున్న కళ్యాణ్ రామ్ కి మాత్రం ఏ ప్రయత్నం కలిసి రావడం లేదు. ప్రస్తుతం తన బ్యానర్ లోనే బింబిసార సినిమాను చేస్తున్నాడు. ఆ మధ్య 25 కోట్ల బడ్జెట్ తో ‘ఓం’ అనే ఒక 3డి యాక్షన్ పిక్చర్ ను తీశాడు. ఆ సినిమా కోసం అప్పులు చేసి మరీ ఇదొక వైవిధ్యమైన సినిమా అన్నాడు.
కట్ చేస్తే.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక పోస్టర్ ఖర్చులకు కూడా డబ్బులు రాలేదు. ఆ సినిమాకు చేసిన అప్పులను చాలా కాలం పాటు కళ్యాణ్ రామ్ కష్టపడి తీర్చిన సంగతులు అప్పుడే కళ్యాణ్ రామ్ మర్చిపోయాడా ? ఏమిటో కళ్యాణ్ రామ్.. ధైర్యమో పిచ్చితనమో అర్ధం కాదు.
Also Read: 83 Trailer Talk: ట్రైలర్ టాక్ : కపిల్ దళం చేసిన అద్భుత సమ్మేళనమే ’83’ !