KCR Praise Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటే అందరికి తెలిసిందే. ఆయన రంగంలోకి దిగితే పక్కా విజయం దక్కుతుందనే వాదన కూడా ఉంది. దీంతో ఆయన తన పనుల నిర్వహణకు భారీ మూల్యం తీసుకుంటారని తెలుస్తోంది. అందుకే ఆయనతో పని చేయించుకోవాలంటే కోట్లు ఖర్చు పెట్టడమే ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో కూడా ఎవరికి తెలియదు. కానీ తన పని తాను చేసుకుపోతారు. నమ్మిన వారికి విజయం దక్కేలా చేయడం చూస్తూనే ఉన్నాం. తమిళనాడులో స్టాలిన్, పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావడానికి కారణం పీకే అని తెలిసిందే.
పీకే కేసీఆర్ తో కూడా సమావేశం అయ్యారు. కానీ ఇటీవల కేసీఆర్ పీకే డబ్బు తీసుకోకుండా పని చేస్తారని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. పీకే సేవలు వినియోగించుకోవాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే కానీ కేసీఆర్ మాత్రం పీకే ఫ్రీగా పనిచేస్తారని చెప్పడం అందరిని ఆలోచింపజేస్తోంది. పీకే వ్యూహాలు అందరికి తెలియవు. ఆయన మొత్తం వ్యవహారాలన్ని ఐ ప్యాక్ ద్వారా చేస్తుంటారని చెబుతుంటారు.
Also Read: వైసీపీ నేతలతో బాలకృష్ణ పీఏ జూదం.. చివరకు ఏం జరిగింది?
గతంలో జగన్ ప్రభుత్వం కూడా పీకేకు భారీ మొత్తంలో నిధులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఐ ప్యాక్ కు రూ.37 కోట్లు చెల్లించినట్లు వైసీపీ లెక్కల్లో చెబుతోంది. దీంతో పీకే సేవలు ఊరకే రావని తెలిసినా కేసీఆర్ మాటల్లో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. క్షేత్రస్థాయి ప్రచారం కోసం పలు టూర్లు చేస్తుంటారు. అదంతా వేరే విషయం అయినా కేసీఆర్ పీకే గురించి మాట్లాడటంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. పీకే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కూడా భారీగానే నిధులు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ పై మచ్చ పడకూడదనే ఉద్దశంతోనే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని అర్థమవుతోంది. ఎవరు కూడా ఉచితంగా పని చేయరని తెలిసినా ఎందుకు కేసీఆర్ పీకేకు ఫ్రీ ట్యాగ్ చేశారో తెలియడం లేదు. పీకే సేవలు అమూల్యమైనవని తెలిసినా ఆయన ఉచితంగా సేవలు చేస్తారని చెప్పడం కేసీఆర్ కే చెల్లింది. దీంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తానికి పీకే వ్యవహారంలో కేసీఆర్ నోరు జారారా? లేక ఉద్దేశపూర్వకంగా చేశారా? అనేది తేలాల్సి ఉంది.
Also Read: ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ తయారేనా?