Telugu Media: సాక్షి మీడియా సంస్థ కొన్ని గొప్ప కార్యాలు చేస్తోంది. సాక్షి సీఈవోగా ఉత్తరాది వ్యక్తిని మూడేళ్ల కిందటే తీసుకొచ్చింది. కానీ చివరకు ఆయనను ఉద్యోగం నుంచి తప్పించింది. సాక్షి వ్యవహారాలు సాఫీగానే సాగుతున్నా ఆయనను మాత్రం విధుల నుంచి తీసేసింది. జగన్ కుటుంబానికి ఆప్తుడైన నవత్ రెడ్డి అనే ఆడిటర్ ను సీఈవోగా నియమించింది. దీంతో సాక్షిలో ఏం జరుగుతుందనే చర్చ సాగుతోంది. పని చేసే వారిని పంపేయడం పనికి మాలిన వారిని అందలాలెక్కించడం మామూలే అనే వాదన కూడా వస్తోంది.

వినయ్ మహేశ్వరి సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎలాంటి సమస్యలు లేకున్నా తరువాత కరోనా కాలంలో వ్యవస్థ అతలాకుతలం అయింది. అధికారంలో ఉన్నా పేపర్ మాత్రం కష్టాల్లోనే నడిచింది. దీంతో ఇలాంటి విపత్తు సమయంలో వినయ్ మహేశ్వరి ఏం చేయలేరనే ఉద్దేశంతో ఆయనను ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా సాక్షిలో ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉండాలనే సహనం అందరిలో కనబడుతుంది.
Also Read: వైసీపీ నేతలతో బాలకృష్ణ పీఏ జూదం.. చివరకు ఏం జరిగింది?
ఇప్పుడు ఆడిటర్ నే సీఈవోగా చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సాక్షి లాభాల బాటలో పయనించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఉద్దేశంతోనే వినయ్ మహేశ్వరిని తొలగించినట్లు తెలుస్తోంది. కొత్త సీఈవో పత్రికను నాలుగు జోన్లుగా విభజించి నలుగురు మేనేజర్లను పెట్టుకుని పనులు చేస్తున్నారు. ఈ మేరకు ఆయనకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి కష్టకాలంలో ఆదుకున్న వారిని కూడా సాక్షి నిర్దాక్షిణ్యంగా తొలగించడం తెలిసిందే. మీడియా రంగంలో కొత్త విధానాలు తీసుకొచ్చిన విజయ్ మహేశ్వరిని అకారణంగా తొలగించారనే విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు యాజమాన్యం అనుకుంటే ఉద్యోగిని తీసేయడం పెద్ద సమస్యేమీ కాదు. వారికి నచ్చకుంటే అంత సంగతి. ఏదిఏమైనా వినయ్ మహేశ్వరిని తొలగించడం మాత్రం సరైంది కాదనే చర్చలు సైతం వస్తున్నాయి.
Also Read: కట్టెకాలే వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానన్న వెంకట్‌రెడ్డి.. రేవంత్‌కు అతిపెద్ద మద్దతు