CM KCR: రాష్ర్టంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం లేదు. ఫలితంగా ఉద్యోగాలు సాధించాలనే నిరుద్యోగుల ఆశలు తీరడం లేదు. వయోభారం పెరగడంతో ఉద్యోగాల సాధన సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ నిర్వాకంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోస్టులు భర్తీ చేయాలని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఉద్యోగాలు పొందాలనే నిరుద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టడం లేదు.

రాష్ర్టపతి ఉత్తర్వుల మేరకు ఖాళీల భర్తీకి రెండేళ్లుగా కొనసాగుతున్న కసరత్తు కొలిక్కి రావడం లేదు. దీంతో కొత్త జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల వర్గీకరణపై ఇంకా నిర్ణయం జరగడం లేదు. దీంతో దాదాపు 25 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో 19 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడలేదు. మరోవైపు 2018లోనే 150 పోస్టులతో గ్రూప్-1 ప్రకటన వెలువడినా అది నిలిచిపోయింది. ఇంకా గ్రూప్-2 ఇతరత్రా పోస్టులు 1949 పోస్టులు కూడా భర్తీ కావడం లేదు.
రాష్ర్టపతి ఉత్తర్వుల కారణంగా దాదాపు 12 వేల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గురుకుల నియామక బోర్డు పరిధిలో కూడా దాదాపు 8 వేల పోస్టులు భర్తీ కావడం లేదు. దీంతో నిరుద్యోగులకు తీపి కబురు అందడం లేదు. బీసీ సంక్షేమ శాఖలో 250కి పైగా గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం కసరత్తు జరగడం లేదు. దీంతో విద్యాబోధన సక్రమంగా సాగడం లేదని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్లు రావడం లేదు. దీంతో నిరుద్యోగులు కళ్లల్లో వత్తులు వేసుకుని చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కానీ ప్రభుత్వంలో మాత్రం దానికి సంబంధించిన ఎలాంటి ప్రక్రియ జరగడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తున్నారు.
Also Read: Huzurabad By Poll: హుజూరాబాద్ విజేత ఎవరు? ఉత్కంఠ.. తేలేది నేడే.. కౌంటింగ్ ప్రారంభం