CM KCR Early Elections: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు వెళతారనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో కేసీఆర్ నిర్ణయాలు కూడా వాటికి ఆజ్యం పోస్తున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నందున రాష్ట్రంలో ఎదురులేకుండా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. నిరుద్యోగులకు తీపి కబురు అందించడం కూడా అందులో భాగమేనని తెలుస్తోంది. దీంతోనే కేసీఆర్ వ్యూహాలు కూడా మారుతున్నట్లు సమాచారం.
ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన ప్రకటన వచ్చిన నేపథ్యంలో ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 91 వేల ఉద్యోగాల్లో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సంకేతాలు వస్తున్నట్లు సమాచారం. దీంతో రాబోయే రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయాలని భావిస్తున్నందున ముందస్తు ఎన్నికలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
Also Read: కేసీఆర్ ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేశారా?
కేసీఆర్ ప్రకటనపై ప్రతిపక్షాలు ఇది ఎన్నికల ప్రకటన అని తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత రావు ఉద్యోగాల ప్రకటనపై కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఎన్నికల స్టంటులో భాగంగానే ఉద్యోగాల ప్రకటన చేశారని విమర్శలు చేశారు. ఇన్నాళ్లు చేయని ప్రకటన ఇప్పుడెందుకు చేశారంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారనే సంకేతాలు ఇస్తున్నారని చెబుతున్నారు. దీంతో కేసీఆర్ వ్యూహంపై పలువురు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓటమి ఖాయమనే వాదనలు కూడా వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతోనే ఇలాంటి చౌకబారు విధానాలు అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంకా ఓటర్లను ప్రభావితం చేసే పనిలో భాగంగానే నిరుద్యోగులకు వరాలు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇంకా ఎన్ని వ్యూహాలు పన్నుతారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: నిరుద్యోగులను బీజేపీ నుంచి ఒక్క దెబ్బతో వేరు చేసిన కేసీఆర్