Site icon OkTelugu

Digital India Jobs: డిజిటల్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

Digital India Jobs: డిజిటల్‌ ఇండియా కార్పొరేషన్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు సంబంధించిన ఈ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 15 ఉద్యోగ ఖాళీలకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.

Digital India Jobs

మొత్తం 15 ఉద్యోగ ఖాళీలలో ప్రోగ్రాం డైరెక్టర్‌ పోస్టులు, అడ్మిన్‌ స్టాఫ్‌ పోస్టులు, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులు, పోర్టర్‌ డైరెక్టర్‌ పోస్టులు, ఫైనాన్స్‌ కో ఆర్డినేటర్‌ పోస్టులు, ఫైనాన్స్‌ మేనేజర్‌ పోస్టులు, పోర్టర్‌ మేనేజర్‌ పోస్టులు, ప్రోగ్రాం మేనేజర్‌ పోస్టులు, మార్కెటింగ్‌ మేనేజర్‌ పోస్టులు ఉన్నాయి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు కేసీఆర్ రెడీయేనా?

https://dic.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 2022 సంవత్సరం మార్చి 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.

Also Read: ముందస్తు కోసమే కేసీఆర్ నిరుద్యోగులకు వరాలు ప్రకటించారా?

Exit mobile version