CM KCR- National Politics: జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనకు దేశవ్యాప్త పర్యటన ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఢిల్లీ, పంజాబ్, కర్నాటక పర్యటన తర్వాత కొంత క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఫ్రంటు లేదు టెంటు లేదు.. దేశ ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పనకు కృషి చేస్తా.. అని మాత్రమే చెప్పిన కేసీఆర్ తాజాగా బెంగళూర్‌లో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన తర్వాత తృతీయ ఫ్రంట్ పేరు ప్రస్తావించారు. రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారని ప్రకటించారు. ఢిల్లీ, పంజాబ్‌లో కేజ్రీవాల్, కర్ణాటకలో దేవెగౌడ, కుమారస్వామిని కలిసిన తర్వాత దేశంలో కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమిపైనే ప్రధానంగా చర్చించారు. నేడో రేపో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలవనున్నారు. ప్రత్యామ్నాయ ఎజెండాను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఫ్రంటుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ కుటుంబ పార్టీలే..
దేశంలో కుటుంబ పాలన అంతం కావాలని ప్రధాని నరేంద్రమోదీ చాలాకాలంగా పిలుపునిస్తున్నారు. ఇన్నాళ్లూ ఈ పిలుపు కాంగ్రెస్ పార్టీ కోసమే అని అందరూ భావించారు. కానీ గురువారం తెలంగాణకు వచ్చిన మోదీ.. వందలాది మంది ప్రాణత్యాగంతో సిద్ధించిన ప్రత్యేక రాష్ట్ర ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిందని, దానిని నుంచి విముక్తి అయితేనే తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితాలు వస్తాయని పరోక్షంగా కేసీఆర్ పాలన గురించి పిలుపునిచ్చారు.
Also Read: Chandrababu Pawan Kalyan: సంచలనం: సీఎం సీటును పవన్ కళ్యాణ్ కు త్యాగం చేయడానికి చంద్రబాబు ఓకే?
దేశం స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కుటుంబ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకుతాము చేస్తున్న పోరాటం త్వరలో ఫలిస్తుందన్నారు. కుటుంబ పాలన ఎంత ప్రమాదకరమో వివరించారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ మొదట ప్రత్యామ్నాయ ఎజెండా అని.. ఇప్పుడు దానిని పక్కన పెట్టి మళ్లీ ప్రత్యామ్నాయ కూటమి నినాదాన్ని ఎత్తుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయాలోనూ ఇలాగే ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొన్ని రాష్ట్రాలు తిరిగొచ్చారు. అవి ఫలించకపోవడంతో వెనక్కి తగ్గారారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు రెండేళ్లు ఉండడంతో మరోమారు మూడో కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇక్కడ ఆయన కలుస్తున్న పార్టీలన్నీ కుటుంబ పాలన సాగిస్తున్నవే కావడం గమనార్హం.
కుటుంబ పాలనతో పతనానికి శ్రీలంకే నిదర్శనం..
బీజేపీ మొదటి నుంచి చెబుతున్నట్టు కుటుంబ పాలనతో ఒక్క కుటుంబమే వృద్ధి చెందుతుంది. ప్రజాస్వామ్యం పతనం అవుతుంది. బీజేపీ నిర్ణయం మంచిదే అనడానికి మరో ఉదాహరణ శ్రీలంక. దేశంలో అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు, అధికారులు అన్నీ ఒకే కుటుంబం చేతులో పెట్టుకుని సాగించిన పాలనతో ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ క్రమంలో తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్నట్లు ప్రతిపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ మూడో కూటమి, ప్రత్యామ్నాయ ఎజెండా అంటూ దేశయాత్ర మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆయన కలుస్తున్న పార్టీలన్నీ కూడా కుటుంబ పాలన సాగించేవే కావడం గమనార్హం. కాకతాళీయమో.. కావాలని చేస్తున్న పనేనో కానీ.. కేసీఆర్ కలిసిన అఖిలేష్‌యాదవ్, దేవెగౌడ, తేజస్వియాదవ్, స్టాలిన్ చివరకు మమతా బెనర్జీ అంతా కుటుంబ పాలన సాగించే ప్రాంతీయ పార్టీల అధినేతలే. దీంతో ఏ పాలనైతే ప్రజాస్వామ్యానికి విఘాతమని బీజేపీ చెబుతోందో.. అదే పాలన సాగిస్తూ, అలాంటి పార్టీలనే కేసీఆర్ కలవడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Also Read:Telugu Desam Party: ఏదీ ఆ వైభవం.. వస్తుందా నాటి ప్రాభవం.. టీడీపీకి భవిష్యత్ బెంగ!!