KCR- Regional parties: లోక్‌సభ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండడంతో దేశంలో బీజేపీ, కాంగ్రెసేత ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసిన ఫెడరల్ ఫ్రంట్ బెడిసి కొట్టడంతో ఈసారి ముందుగానే సర్దుకున్నారు. ప్రత్యామ్నాయ కూటమితో ఉజ్వల్ భారత్ సాధించాలన్న సంకల్పం కేసీఆర్‌ది. అయితే కాలువ అయినా నది అయినా సముద్రం అయినా ఈత వస్తేనే ఈదగలరు.
సొంత రాష్ట్రం తెలగాణలో వరుసగా రెండుసార్లు అధికారలలోకి వచ్చి.. 8 ఏళ్ల పాలనతో తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న కేసీఆర్ కుటుంబ పాలన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఉజ్వల భారత్ కోసం చేసే ప్రయత్నంలోనూ కుటుంబ పార్టీల నేతలను కలుస్తున్నారు. వారితోనే కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నదే కీలకమైన పాయింట్. కారణం ఏమిటంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటేనే జరిగే పని కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏకకాలంలో రెండు జాతీయ పార్టీలను దూరంగా పెట్టి కేవలం ప్రాంతీయ పార్టీలు, అదీ కుటుంబ పాలనకు చిరునామా అయిన పార్టీలతో జాతీయ స్ధాయిలో మూడో కూటమిని ఏర్పాటు చేయటం సాధ్యమయ్యే పని కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: CM KCR- National Politics: కేసీఆర్ కలిసే పార్టీలన్నీ అవే.. కుటుంబ పార్టీలే ప్రత్యామ్నాయమా!?
కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఎలా?
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మూడో కూటమిని ఎవరు తీసుకురావాలన్నా కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీలో ఏదో ఒకదాని మద్దతు తప్పనిసరి. అలాకాకుండా జాతీయ రాజకీయాలు నడపటం జరిగే పని కాదు. దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న కేసీఆర్‌కు ఇది తెలియని విషయం కాదు. కాంగ్రెస్‌ను దూరం పెట్టి జాతీయ రాజకీయాల్లో ఎన్డీయేకి వ్యతిరేకంగా రాజకీయం చేయటం సాధ్యం కాదని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయినా కేసీఆర్ మాత్రం మూడో కూటమి అంటూనే ముందుకు సాగుతున్నారు.
వాపు చూసుకుని బలుపనుకుంటున్నారా..
కేసీఆర్ ప్రయత్నాలను ఆ మధ్య ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. దాంతో తనకు ఎవరూ మద్దతివ్వడం లేదన్న విషయాన్ని గ్రహించి కేసీయార్ కూడా కామ్ అయ్యారు. కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ యాక్టివ్ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, బెంగుళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో భేటీ అయ్యారు. ఉజ్వల్ భారత్ సాధనే తన టార్గెట్ గా చెప్పుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తన బలాన్ని కేసీఆర్ వాస్తవానికి మించి చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే క్రెడిబులిటీ తక్కువ. దానికి తోడు ఒంటెత్తు పోకడతో వెళుతున్నారు. ఈ కారణంతోనే నాన్ కాంగ్రెస్ సీఎంలు పెద్దగా సానుకూలంగా ఉన్నట్లులేరు. ఈ నేప«థ్యంలో మూడునెలల్లో సంచలనాలు చూస్తారు, సంచలన వార్తచెబుతా అంటు కొత్తరాగం మొదలుపెట్టారు. ప్రాంతీయ పార్టీల తోక పట్టుకుని జాతీయ రాజకీయసంద్రం ఈదే ప్రయత్నంలో కేసీఆర్ మధ్యలోనే మునుగుతారా.. విజేతగా ఒడ్డుకు చేరుతారా అనేది వేచిచూద్దాం.
Also Read:Telugu Desam Party: ఏదీ ఆ వైభవం.. వస్తుందా నాటి ప్రాభవం.. టీడీపీకి భవిష్యత్ బెంగ!!