KCR Third Front: దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా అజెండా లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాజాగా మళ్లీ మూడు కూటమిగా ముందుకు పోవాలనుకుంటున్నారు. ఇందుకోసం రూట్‌మ్యాప్ తయారీలో నిమగ్నమయ్యారు. ఆప్, తృణమోల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈమేరకు 2024 లోక్‌సభ ఎన్నికలకు రూట్‌మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు నెలల్లో దేశంలో సంచలనం సృష్టించబోతున్నామని పదేపదే చెబుతున్న కేసీఆర్ కూటమేపై ప్రకటన చేస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది ఏమేరకు సఫలమవుతుందో వేచి చూడాలి.
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి దేశ రాజకీయాలపై కీలక చర్చలు జరిపారు. కేసీఆర్‌తో కలిసి రాజకీయంగా ముందుకు సాగే ఆలోచనలో లేనప్పటికీ, ఆయన చేసే ప్రతిపాదనపై కేజ్రీవాల్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక తాజాగా మాజీ ప్రధాని హెచ్‌డీ.దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ.కుమారస్వామితో చర్చలు జపారు. అందరిముందు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం.
Also Read: Chandrababu Pawan Kalyan: సంచలనం: సీఎం సీటును పవన్ కళ్యాణ్ కు త్యాగం చేయడానికి చంద్రబాబు ఓకే?
కూటమికి కుమారస్వామి సానుకూలం..
కేసీఆర్ ప్రతిపాదించిన మూడో కూటమికి కర్ణాటక మాజీ సానుకూలంగా స్పందించిన కుమారస్వామి సానుకులత తెలిసినట్లు సమాచారం. మీటింగ్‌లో రాష్ట్రపతి ఎన్నికలు కూడా చర్చకు వచ్చాయని, ఈ సమయంలో ప్రత్యామ్నాయ శక్తికి నాయకత్వం వహించాలని కేసీఆర్ దేవెగౌడను కోరినట్లు తెలిసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలైలో ముగియనున్నందున రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన సూచించినట్లు సమాచారం. దేవెగౌడ కూడా కేసీఆర్ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్ధం అవుతోంది.
జాతీయ రాజకీయాల్లో చంక్రం తిప్పాలనే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఉత్సాహం చూపుతున్న కేసీఆర్ దేశ పర్యటన ప్రారంభించి తాజాగా బెంగళూరులో దేవెగౌడ, కుమారస్వామితో చర్చించిన అనంతరం దేశంలో గుణాత్మక మార్పు రావాలని, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారు అని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని దానిని ఎవరూ ఆపలేరని పేర్కొన్న కేసీఆర్, రెండు మూడు నెలల్లో సంచలన వార్త వింటారు అని ప్రకటించారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన క్రమంలో పట్టు వదలకుండా ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఎన్నికల రోడ్ మ్యాప్ ఏమేరకు సక్సెస్ అవుతుందో?
ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్ తో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తోనూ, జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామితోనూ చర్చలు జరిపిన కేసీఆర్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. ఈ పార్టీలను ఏకతాటి మీదకు తీసుకు వస్తే, 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ కు రోడ్ మ్యాప్ రెడీ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కలిసికట్టుగా పని చేద్దామని ప్రతిపాదిస్తూ పర్యటనలు సాగిస్తున్నారు. ఇక ఈ పర్యటనలలో, అందరినీ ఏకతాటి మీదకు తీసుకురావటంలో కేసీఆర్æ ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.