CM KCR: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొద్ది కాలంగా విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలు గాలికి పోతున్నాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రమే నిర్లక్ష్యం వహిస్తోందని టీఆర్ఎస్ పార్టీ అంటుంటే ఏ రాష్ర్టంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య రేగిన రగడ ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ప్రధాని, అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదని చెబుతుండటంతో సమస్య మరింత పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం సీఎం కేసీఆర్ ప్రధాని, అమిత్ షా అపాయింట్ మెంట్ అడగలేదని బదులిచ్చింది. దీంతో సీఎం ఇరకాటంటంలో పడ్డారు. ఒకరిపై మరొకరు బుదర జల్లుకునే క్రమంలో ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిపిస్తోంది. ప్రజల సమస్యలు తీర్చేందుకు ఉద్దేశించిన పర్యటనలు చేస్తూ వారికే ప్రయోజనం చేకూర్చని పనులు చేస్తూ తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారనే విషయం తెలిసిపోతోంది.
దీంతో రాబోయే ఎన్నికల్లో టీఱర్ఎస్ కు మనుగడ కష్టమేనని తెలుస్తోంది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పినా స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో రాష్ర్ట మంత్రుల బృందం చర్చించాన అందులో సీఎం కేసీఆర్ ఎందుకు లేరని ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: Andhra Pradesh floods: వరద ప్రాంతాలకు జగన్ అందుకే పోలేదట?
ఆయన తన భార్యను ఆస్పత్రిలో చూపించడానికి వెళ్లారని మరో వార్త సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు విశ్వసించరనే బీజేపీ వాదనకు బలం చేకూరుతోంది. తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.
Also Read: China: చైనాలో పెళ్లికాని వారి సంఖ్య ఎక్కువే?