RRR: నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మూడో పాట జనాని సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా, శ్రీయాలను కూడా బాగా హైలైట్ చేశారు. అయితే, అందరిలోకెల్లా ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్, తారక్ తన కళ్ళల్లో చూపించిన ఎమోషన్స్ అద్భుతంగా పేలాయి. ఎంతైనా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే.
అసలు నటన కోసమే ఎన్టీఆర్ పుట్టాడేమో. సీనియర్ ఎన్టీఆర్ పేరును నిలబెట్టిన నిజమైన ఆయన నట వారసుడు జూనియర్ ఎన్టీఆరే. క్లోజ్ షాట్స్ లో సింగిల్ ఎక్స్ ప్రెషన్నే పలికించడం కష్టం. అలాంటిది తారక్ మాత్రం.. నుదురు పై ఒక ఎక్స్ ప్రెషన్ ను, బుగ్గల పై మరో ఎక్స్ ప్రెషన్స్ ను ఇక కళ్ళల్లో ఎమోషనల్ ఫీల్ ను హైలైట్ చేయడం అంటే ఈ జనరేషన్ లో ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం.
ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం ఉంది. ఆ అభిమానమే ఎన్టీఆర్ ఎమోషన్స్ కి కారణం అయి ఉండొచ్చు. ఈ సాంగ్ లో మరో ఏ నటుడికి క్లోజ్ లు పెట్టని రాజమౌళి, ఎన్టీఆర్ కు మాత్రమే ఓన్లీ క్లోజ్ లే పెట్టాడు. అయినా తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అని రాజమౌళి ఎన్నో సందర్భాలలో చెప్పాడు. ఆ ఇష్టాన్ని ఇలా ఈ విధంగా చూపించి ఉండొచ్చు.
అయితే ఈ సాంగ్ చూసాక, సినిమాలో తారక్ కోసం చరణ్ పాత్రను తగ్గించబోతున్నాడనే రూమర్ కూడా ప్రస్తుతం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. రాజమౌళి సినిమా లెంగ్త్ ను తగ్గించాలకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాబట్టి.. సినిమాలో సీన్స్ కట్ చేయాల్సి వస్తే.. చరణ్ పార్ట్ నే ఎక్కువగా కట్ చేసే అవకాశం ఉంది. ఎలాగూ ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని రాజమౌళి బలంగా నమ్ముతున్నాడు.
Also Read: Drushyam Movie Esther Anil: ‘దృశ్యం’ భామ ‘ఎస్తేర్ అనిల్’ బయోగ్రఫీ !
అదే చరణ్ కి మిగిలిన టీమ్ కి చెప్పి.. చరణ్ పాత్ర తగ్గించి, ఎన్టీఆర్ పాత్రను పెంచే ఛాన్స్ ఉంది. పెంచినా ఎన్టీఆర్ న్యాయం చేస్తాడు అనుకోండి. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Lakshhya Movie: నాగ శౌర్య ” లక్ష్య ” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?