83 teaser: ఇది సినిమా టీజర్ కాదు, ఎమోషనల్ జర్నీ !

83 teaser: అది 1983వ సంవత్సరం.. ఇప్పటి ఇండియన్ క్యాలెండర్ లో కూడా ఆ సంవత్సరం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఎప్పటికీ హిస్టారికల్ ఇయర్ గా 1983 చరిత్రను క్రియేట్ చేసుకుంది. ఆ చరిత్ర వెనుక ఉన్న టీమ్ లో ముఖ్యమైన వ్యక్తి ‘కపిల్ దేవ్’. ఇండియా మొదటి వరల్డ్ కప్ను అందించిన గ్రేట్ ఆల్ రౌండర్. అందుకే కపిల్ ఇమేజ్ ఇప్పటికీ ఎప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. మరి హిస్టారికల్ మూమెంట్ ను ఎప్పుడు భవిష్యత్తు […]

Written By: Shiva, Updated On : November 26, 2021 6:20 pm
Follow us on

83 teaser: అది 1983వ సంవత్సరం.. ఇప్పటి ఇండియన్ క్యాలెండర్ లో కూడా ఆ సంవత్సరం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఎప్పటికీ హిస్టారికల్ ఇయర్ గా 1983 చరిత్రను క్రియేట్ చేసుకుంది. ఆ చరిత్ర వెనుక ఉన్న టీమ్ లో ముఖ్యమైన వ్యక్తి ‘కపిల్ దేవ్’. ఇండియా మొదటి వరల్డ్ కప్ను అందించిన గ్రేట్ ఆల్ రౌండర్. అందుకే కపిల్ ఇమేజ్ ఇప్పటికీ ఎప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది.

83 teaser

మరి హిస్టారికల్ మూమెంట్ ను ఎప్పుడు భవిష్యత్తు తరాల వాళ్లకు అంతే గొప్పగా అందించాల్సిన అవసరం ఉంది. అందుకే 1983 వరల్డ్ కప్ ఘట్టాన్ని వెండితెర పైకి తీసుకురాబోతున్నారు. క్రికెటర్ కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా ’83’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ పై హీరో నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.

Also Read: చైనాలో పెళ్లికాని వారి సంఖ్య ఎక్కువే?

అయితే, తాజాగా అక్కినేని నాగార్జున ఈ ‘83’ సినిమా టీజర్‌ ను ట్విటర్‌ లో పోస్ట్ చేశాడు. ఇక ఈ టీజర్ లో 1983లో భారత్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ అందుకోవడానికి కారణమైన క్యాచ్‌ని ఈ టీజర్ లో హైలైట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. మొత్తమ్మీద టీజర్ హైలైట్ గా ఉంది. ముఖ్యంగా టీజర్ చివర్లో ఇండియా జిందాబాద్ అనే నినాదాలు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఇది సినిమా టీజర్ కాదు, ఎమోషనల్ జర్నీ అనిపించింది.

దేశ భక్తిని రగిలించే విధంగా టీజర్తో ఉండటంతో సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో 1983లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటనే కోణంతో పాటు కపిల్ దేవ్ జీవితం గమనం, ఆయన సాధించిన విజయాల వివరాలు తాలూకు సంఘటనలు సినిమాలో ఉండనున్నాయి.

Also Read: అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?

Tags