https://oktelugu.com/

CM KCR: ‘ముందస్తు’కు వెళ్లితే కేసీఆర్ తన గొయ్యి తాను తవ్వుకున్నట్టేనా?

CM KCR: ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఎంతో అభివృద్ధి, ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని గులాబీ శ్రేణులు పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, కాళేశ్వరం వంటి అద్భుతాన్ని సృష్టించిన ఘనతే తమదే అని చెప్పుకుంటున్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ , కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అద్భుతమైన సంక్షేమ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 3:49 pm
    CM KCR To Delhi

    CM KCR To Delhi

    Follow us on

    CM KCR: ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఎంతో అభివృద్ధి, ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని గులాబీ శ్రేణులు పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, కాళేశ్వరం వంటి అద్భుతాన్ని సృష్టించిన ఘనతే తమదే అని చెప్పుకుంటున్నారు. రైతుబంధు, ఆసరా పెన్షన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ , కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అద్భుతమైన సంక్షేమ పథకాలు మనరాష్ట్రంలో మినహా దేశంలో ఎక్కడా అమలుకావడం లేదని ప్రతీసారి సభలు, సమావేశాల్లో సీఎం కేసీఆర్, ఆ పార్టీ నేతలు జనాలకు వివరిస్తుంటారు. ఈ పథకాలే తమకు మూడోసారి కూడా అధికారం కట్టబెడతాయని కారు పార్టీ నేతలు ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రజలు మూడోసారి కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ పార్టీని గానీ నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? అంటే సమాధానం మాత్రం చెప్పలేం అని వినిపిస్తుంది.
    CM KCR To Delhi
    2018 నాటి పరిస్థితులు వేరు..
    తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక ఉద్యమనేత కేసీఆర్‌కు ప్రజలు నీరాజనం పలికారు. 2014లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి జై కొట్టి కేసీఆర్‌ను ఏకంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. అయితే, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ పాలనా శైలిపై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. ఆ నాలుగేళ్లు అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, హరితహారం ఇలా సాగిపోయింది. ఆలోపే ఎన్నికలు దగ్గరపడగా ప్రజల నుంచి తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గమనించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018 చివర్లో జరిగిన ఎన్నికల సమయానికి కొత్తగా రైతుబంధు, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ పెంపు వంటి సంక్షేమ పథకాల ప్రకటనలతో కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడు కేసీఆర్ మీద పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ, 2022 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు రాష్ట్రంలో అస్సలు అమలు జరగలేదని జనాలు ఆగ్రహంతో ఉన్నారు.

    Also Read:<KTR vs Sharmila: కేటీఆర్ వర్సెస్ షర్మిల: నాడు తెలియదందీ.. నేడు పొగిడేసింది..!

    నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నం..
     2018 ముందస్తు ఎన్నికలలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి నేటికి ఆచరణలో లేదు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు రాలేదు. దీంతో నిరుద్యోగులు కేసీఆర్‌, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదు. ఉద్యమ వ్యతిరేకులకు పార్టీలో అందలం ఎక్కించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు. ఇటీవల ప్రకటించిన దళితబంధు ఊసేలేదు. రైతుబంధు విడుదలలో ఆలస్యం.. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఎవరూ సంతోషంగా లేరని టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు రైతుల సపోర్టుతో దూసుకెళ్లిన కేసీఆర్‌కు ఇప్పుడు వారు కూడా వ్యతిరేకంగా మారారు.
    బంగారు తెలంగాణ ఏమో కానీ రాష్ట్రం అప్పుల పాలయ్యింది. కరోనా టైంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు, టీఆర్ఎస్ నేతల అవినీతి, నియోజకవర్గాల్లో భూముల ఆక్రమణ, పోడు రైతుల సమస్య ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్మంగా నిరుద్యోగ సెగ ఈసారి కేసీఆర్‌కు తప్పకుండా తగులుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కూడా దానికి బలం చేకూరుస్తున్నాయి. అయితే, ఇన్ని సమస్యల నడుమ కేసీఆర్ మరోసారి సంక్షేమ పథకాలను అడ్డుపెట్టుకుని ముందస్తుకు వెళ్లిన ఘోరంగా దెబ్బతినడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు యాక్టివ్ అయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని దాటేసి మరీ బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ సారి కేసీఆర్ ముందస్తుకు వెళ్లితే గులాబీ పార్టీలో టికెట్స్ దక్కని వారంతా బీజేపీలో చేరి కారు టైర్లను పంక్చర్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ముందస్తుకు వెళ్తారో లేదో వేచి చూద్దాం..
    Tags