https://oktelugu.com/

Pushpa: నార్త్​లో నాదే హవా అంటున్న పుష్పరాజ్​.. అస్సలు తగ్గట్లేదుగా!

Pushpa: భారీ అంచనాల మధ్య డిసెంబరు 17న విడుదలైన పుష్ప. అంతే జోరుతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లోనూ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. విడుదలైన రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులు నెలకొల్పింది. మూడు రోజుల్లోనే రూ.173 కోట్లు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 / 12:17 PM IST
    Follow us on

    Pushpa: భారీ అంచనాల మధ్య డిసెంబరు 17న విడుదలైన పుష్ప. అంతే జోరుతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా, అన్ని భాషల్లోనూ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది. విడుదలైన రెండో రోజే 100 కోట్ల క్లబ్​లో చేరి రికార్డులు నెలకొల్పింది. మూడు రోజుల్లోనే రూ.173 కోట్లు వసూళ్లు చేసింది.

    పాన్​ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నార్త్​లో పుష్ప జోరు మాములుగా లేదు. అక్కడ బాలీవుడ్ సినిమా హీరోలకు ఎంత క్రేజీ స్పందన లభిస్తుందో.. అంతే రేంజ్​లో పుష్ప మార్క్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా వీక్​డేస్​లోనూ హౌస్​ఫుల్​ చేస్తుండటం గమనార్హం. రోజుకు 3 కోట్ల నెట్​ వసూళ్లు తగ్గకుండా వస్తున్నాయని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం ఒక కారణమైతే.. ఐకాన్ స్టార్​కి నార్త్​లో ఉన్న క్రేజ్ కూడా మరొకటని చెప్పాలి.

    కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాను సుకుమార్ ఎంతో తెలివిగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రతి అంశాన్ని వదలకుండా రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇందులో రష్మిక హీరోయిన్​గా నటించగా.. సునీల్​ ,అనసూయ తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత కూడా స్పెషల్​ సాంగ్​లో అలరించి హాట్​, క్యూట్​ లుక్స్​తో అలరించింది. దేవి  శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు అందించారు.