https://oktelugu.com/

Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్​కు థ్యాంక్స్ చెప్తూ చిరు ట్వీట్​

Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతులిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై తాజాగా, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇండస్ట్రీకి మేలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్​కు ధన్యవాాలు తెలిపారు చిరు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేస్తూ.. తెలుగు సినిమా పరిశ్రమ కోరిక మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ ఓనర్లకు అన్ని వర్గాల వారికి నాయ్యం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 25, 2021 12:31 pm
    Follow us on

    Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతులిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై తాజాగా, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇండస్ట్రీకి మేలు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్​కు ధన్యవాాలు తెలిపారు చిరు. ఈ క్రమంలోనే ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేస్తూ.. తెలుగు సినిమా పరిశ్రమ కోరిక మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ ఓనర్లకు అన్ని వర్గాల వారికి నాయ్యం చేకూరేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ గారికి కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. అంటూ చిరు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

    chiranjeevi-says-thanks-to-kcr-on-ts-ticket-rates-new-go

    మరోవైపు ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గిస్తూ జీఓలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్ల ఓనర్లు, ఎగ్సిబిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి చాలవన్నట్లు.. తనిఖీల పేరుతో కొన్ని థియేటర్లను సీజ్ కూడా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థుతుల్లో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది.

    https://twitter.com/KChiruTweets/status/1474613715089584131?s=20

    తెంలంగాణ సర్కారు జారీ చేసిన నూతన జీఓ ప్రకారం.. జీఎస్టీ మినహా ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల కోసం, కనిష్ట ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు, ధర రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్‌టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి), టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్‌లకు అనుమతులు ఇచ్చింది.