CM Jagan: పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ మరోసారి నోరు పారేసుకున్నారు. వ్యక్తిగత కామెంట్స్ చేశారు. ఆయన వైవాహిక జీవితం పై మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యా దీవెన నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పవన్ ను టార్గెట్ చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉంటుందని.. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తి అని.. అలాంటి వారిని ఓటు వేయడం ధర్మమేనా అని భీమవరం ప్రజలను ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా పవన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
కార్లను మార్చినంత ఈజీగా భార్యలను మార్చుతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని… ఈ దత్త పుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజీ స్టార్ అంటూ మండిపడ్డారు. మహిళలను ఆట వస్తువులుగా చూస్తాడని.. నాలుగేళ్లకోసారి కార్లను మార్చిన విధంగా భార్యలను మార్చుతాడు అని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడం కానీ.. చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నానని కామెంట్స్ చేశారు. రెండు విషయాలు కలిస్తే అమృతం తయారవుతుందా? నలుగురు వంచకులు కలిస్తే జనాన్ని మంచి చేస్తారా అని ప్రశ్నించారు. ఇటువంటివారిని ఆదర్శంగా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
భీమవరం ప్రజలు తెలివైన వారని.. వచ్చే ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై జగన్ ప్రశంసలు కురిపించారు. ఓ సినిమా హీరోని ఓడించిన రియల్ హీరో శీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ… భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గ్రంధి శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. భీమవరం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. మొత్తానికైతే పవన్ ను టార్గెట్ చేస్తూ జగన్ మరోసారి విరుచుకు పడడం విశేషం. దీనిపై జనసేనాని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.