Prashanth Neel: సలార్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్…ప్రస్తుతం ఇండియన్ సినిమాని శాసిస్తున్న డైరెక్టర్ అనే చెప్పాలి. ఇంతకుముందు కేజిఎఫ్ సిరీస్ తో తనకంటూ ఒక రేంజ్ మార్కును సెట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఏకంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాడు ఇప్పటికే ఈయన చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుంది అనే చెప్పాలి. అయితే ప్రశాంత్ నీల్ సినిమా ఇండస్ట్రీకి రావడానికి సినిమా మీదున్న ఫ్యాషన్ కారణం కాదట…ఆయానికి డబ్బులు అవసరం ఉండి ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి డైరెక్టర్ గా మారాడు…
ఆయన తీసిన మొదటి సినిమా అయిన ఉగ్రం సినిమాలో హీరో అయిన శ్రీ మురళి తనకు బంధువు స్వయాన ప్రశాంత్ నీల్ చెల్లెలను శ్రీ మురళి పెళ్లి చేసుకున్నాడు. అందుకే ప్రశాంత్ నీల్ మొదటి సినిమా శ్రీ మురళితో చేయాల్సి వచ్చింది… ప్రశాంత్ నీల్ కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ వాళ్ళ పూర్వీకులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని మడకశిర దగ్గర్లోని నీలకంఠాపురం వాసులు…
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో కూడా ప్రశాంత్ నీల్ కి రిలేషన్స్ ఉన్నారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి స్వయాన వాళ్ల చిన్నాన్న అవుతారు. అలాగే ఉగ్రం సినిమా కోసం ప్రశాంత్ నీల్ తన ఇంటిని అమ్మేశాడు ఈ సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే అంత ధైర్యాన్ని చేసి సినిమాను చేసి రిలీజ్ చేసి సక్సెస్ కొట్టారని తెలుస్తుంది. అయితే ప్రశాంత్ నీల్ కి చిన్నప్పుడు చదువు పెద్దగా అబ్బలేదట మ్యాథ్స్ లో 10 మార్కులు కూడా వచ్చేవి కాదట అలాగే డిగ్రీ కూడా తను పూర్తి చేయలేదు అయిన కూడా తనకున్న టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని డైరెక్టర్ గా ఎదిగి ప్రపంచంలోనే ఇప్పుడు చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. ఆయన ఏ సినిమా తీసిన కూడా మహాభారతాన్ని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడని చెప్తూ ఉంటాడు.అందులోని క్యారెక్టర్లతోనే కేజిఎఫ్ ని రాసుకొని ఆ సినిమా చేశారు…
ఇంత మంచి సినిమాలు చేస్తున్నాడు కదా ప్రశాంత్ నీల్ ఎవరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసారని మనం అనుకుంటాం కానీ ఇంతవరకు ఆయన ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. కొన్ని హాలీవుడ్ సినిమాలను చూస్తూ అలాంటి మేకింగ్ తో మనం ఇక్కడ ఎందుకు సినిమా చేయలేము అనే ఉద్దేశ్యం తోనే ఆయన సరికొత్త మేకింగ్ స్టైల్ ని ఏర్పాటు చేసుకొని సినిమా చేస్తున్నట్టు గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు…